మైనస్‌ ఎనిమిది డిగ్రీల చలిలో...

24 Oct, 2019 02:41 IST|Sakshi
రవితేజ

‘డిస్కోరాజా’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టే సమయం దగ్గరపడింది. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్‌. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ఐస్‌ల్యాండ్‌లో జరిగింది. భారీ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించారు. అక్కడ మైనస్‌ ఎనిమిది డిగ్రీల చలిలో కూడా షూటింగ్‌ చేశారు టీమ్‌. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. వారం రోజులు షూటింగ్‌ జరిగితే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూరై్తపోతుందట. రజిని తాళ్లూరి, రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా