మహానుభావుడి వీర ప్రేమగాథ!?

30 Oct, 2017 00:41 IST|Sakshi

హెడ్డింగ్‌ చూసి కన్‌ఫ్యూజ్‌ అవ్వొద్దు. మేటర్‌ కంటిన్యూ చేయండి క్లారిటీ దొరుకుతుంది. టాలీవుడ్‌లో ‘మహానుభావుడు’ శర్వానంద్‌ అన్న విషయాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గతేడాది నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ప్రజెంట్‌ వీరిద్దరూ కాంబినేషన్లో  ఓ సినిమా గురించి డిస్కషన్స్‌ జరుగుతున్నాయన్నది ఫిల్మ్‌నగర్‌ టాక్‌. హను రాఘవపూడి చెప్పిన లవ్‌స్టోరీ లైన్‌కు శర్వా ఇంప్రెస్‌ అయ్యారట. త్వరలోనే అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉంది. మరి.. ఈ మహానుభావుడి వీర ప్రేమగాథ ఎలా ఉంటుందో స్క్రీన్‌పై చూడాల్సిందే.

మరిన్ని వార్తలు