‘డూ యూ లవ్‌ మీ’: రెచ్చిపోయిన హీరోయిన్‌!

27 Feb, 2020 20:05 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌, హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌లు జంటగా నటిస్తున్న చిత్రం భాగీ-3. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిసాజిద్ నడియావాలా నిర్మిస్తున్నాడు. కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి టాక్‌ వచ్చింది. కాగా అన్నదమ్ముల అనుబంధానికి, యాక్షన్‌ను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు అహ్మద్‌. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్‌ అన్న పాత్రలో హీరో రితేశ్ దేశ్‌ముఖ్ నటించాడు. కాగా ఈ సినిమాలో టైగర్‌ ష్రాఫ్‌ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న దిశా పటానీ ఓ ఐటమ్ సాంగ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అమ్మడు ‘డు యూ లవ్‌ మీ’ అంటూ టైగర్‌ ష్రాఫ్‌ వెంట పడుతూ డ్యాన్స్‌ చేసిన ఈ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ తాజాగా విడుదల చేసింది.

ఫోటోగ్రాఫర్‌తో హీరోయిన్‌ బాడీగార్డ్‌ వాగ్వాదం

కాగా ఈ సాంగ్‌లో బికినీ ధరించిన దిశా తన అందంతో టైగర్‌తో పాటు అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతే కాదు కొన్ని అదుర్స్‌ అనిపించే స్టెప్పులేసి అదరగొట్టారు కూడా. ఈ నెల 25న విడుదలైన ఈ సాంగ్‌ యూట్యూబ్‌, ట్విటర్‌ ట్రెండింగ్‌ జాబితాలోకి చేరిపోయింది. ఇ​క మూడు రోజుల్లోనే యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ దాదాపు కోటి 16 లక్షల వ్యూస్‌ను రాబట్టింది. అంతేగాక దిశా కూడా ఈ సాంగ్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకున్నారు. కాగా అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వంలో భాగికి సీక్వెల్‌గా భాగీ-2 వచ్చిన సంగతి తెలిసిందే. ఇక భాగి-3ని మార్చి 6న  విడుదల చేయనున్నట్లు సమాచారం.

Get ready to groove on with me. #DoYouLoveMe song out tomorrow. #SajidNadiadwala’s #Baaghi3 @tigerjackieshroff @shraddhakapoor @riteishd @khan_ahmedasas @wardakhannadiadwala @tanishk_bagchi @nikhitagandhiofficial @tseries.official @adil_choreographer @foxstarhindi @nadiadwalagrandson

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా