‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

24 Jul, 2019 14:07 IST|Sakshi

తలకు తగిలిన గాయం కారణంగా ఆరు నెలల పాటు తన జీవితంలో ఏం జరిగిందో తనకు గుర్తు లేదు అంటున్నారు బాలీవుడ్‌ హీరోయిన్‌ దిశా పటాని. సినిమాల తర్వాత దిశా పటాని ఎక్కువగా వర్కవుట్‌ వీడియోలు, ఫిట్నెస్‌కు సంబంధించిన విషయాల గురించే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. షూటింగ్‌ నుంచి ఏ మాత్రం విరామం దొరికినా జిమ్‌లో ప్రత్యక్షం అయ్యే దిశా.. ప్రస్తుతం జిమ్నాస్టిక్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

ఈ విషయం గురించి దిశా మాట్లాడుతూ.. ‘20 ఏళ్ల లోపే జిమ్నాస్టిక్స్‌ నేర్చుకోవడం ప్రారంభిస్తే మేలు. గత మూడేళ్ల నుంచి నేను జిమ్నాస్టిక్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాను. దాంతో పాటు మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్‌ సాధన చేయాలంటే ఎంతో ధైర్యం, శక్తి కావాలి. సాధన సమయంలో దెబ్బలు తగులుతాయి. కాళ్లు, చేతులు కూడా విరుగుతాయి. కొన్ని నెలల క్రితం జిమ్నాస్టిక్స్‌ చేస్తుండగా.. కింద పడ్డాను. తలకు గాయమైంది. కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. అయితే ఆ ఆరు నెలల్లో నా జీవితంలో ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఆరు నెలల జీవితాన్ని నేను కోల్పోయాను’ అని చెప్పుకొచ్చారు దిశా. కాగా సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్‌’ సినిమా షూటింగ్‌లో దిశా జిమ్నాస్టిక్‌ విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇక కెరీర్‌ విషయానికొస్తే దిశ ప్రస్తుతం.. ఆదిత్య రాయ్‌ కపూర్‌తో కలిసి ‘మళంగ్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సాహో’తో సై!

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

'అత్యంత అందమైన వీడియో ఇది'

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

బన్నీ సినిమాలో టబు లుక్‌!