టైగర్‌ ష్రాఫ్‌ ఫ్యామిలితో దిశా పటానీ టిక్‌టాక్‌

20 Jun, 2020 14:38 IST|Sakshi

ముంబాయి: టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్‌ , తల్లి ఆయేషా ష్రాఫ్ తో కలిసి చేసిన ఒక సరదా పోస్ట్‌ను దిశా పటాని తన ఇన్‌స్టా గ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ఈ ముగ్గురు టిక్‌టాక్‌లో బాగా పాపులర్‌ అయిన ‘హూస్ మోస్ట్ లైక్లీ టు’ ఛాలెంజ్‌ను తీసుకున్నారు. ఈ వీడియోను చూడటం ద్వారా చాలా ఆసక్తికర విషయాలను తెలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. " హాటెస్ట్‌ కుర్రాళ్ళతో ఎవరు బయటకు వెళ్ళారు" వంటి ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. (‘డూ యూ లవ్‌ మీ’: రెచ్చిపోయిన హీరోయిన్‌!)

ఈ వీడియోని చూస్తుంటే కృష్ణ ష్రాఫ్, ఎబాన్ హయామ్స్‌తో తన సంబంధాన్ని ఒక అడుగు ముందుకు తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. కృష్ణ ష్రాఫ్‌ బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు ఎబాన్‌ హయామ్స్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉ‍న్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. “మొదట ఎవరు పెళ్లి చేసుకుంటారు?” అనే ప్రశ్నకు ముగ్గురు కృష్ణ వైపే చేతిని చూపించారు. దీనిని బట్టి చూస్తే కృష్ణ త్వరలో పెళ్లికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణ ఇటీవలే తన బాయ్‌ ఫ్రెండ్‌ ఎబాన్ హైమ్స్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. (బన్ని చిత్రంలో దిశా.. సుక్కు మాస్టర్‌ ప్లాన్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు