లవ్‌.. యాక్షన్‌

6 Jan, 2019 01:03 IST|Sakshi

‘ధీవర’ సినిమా కాన్సెప్ట్‌ బాగుంది. యూత్‌ రిలేట్‌ అయ్యే విధంగా ఈ కథ ఉంది. పోస్టర్‌ నాకు బాగా నచ్చింది. సినిమా మంచి హిట్‌ అవ్వాలి. మొత్తం యూనిట్‌కి ఆల్‌ ద బెస్ట్‌’’ అని దర్శకుడు బాబీ అన్నారు. నాగసాయి, విదా చైతన్య హీరోహీరోయిన్లుగా, విజయ్‌ జిక్కి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధీవర’. భగీరథ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై హరనాథ్‌ బాబు నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు బాబీ విడుదల చేశారు. విజయ్‌ జిక్కి మాట్లాడుతూ– ‘‘టైటిల్‌కు తగ్గట్టుగానే డైనమిక్‌ స్క్రిప్ట్‌తో తెరకెక్కిన చిత్రమిది.

ఇందులో స్క్రీన్‌ప్లే హైలెట్‌గా ఉంటుంది. లవ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమా ఒకేసారి రెండు జానర్స్‌లో సాగుతుంది’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా యూత్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటరై్టనర్‌గా రూపొందిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటోంది. త్వరలోనే ఆడియోతో పాటు ట్రైలర్‌ను విడుదల చేస్తాం. ఫిబ్రవరి నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత హరనాథ్‌ బాబు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అద్దంకి వెంకటేష్, కెమెరా: సాగర్‌ గొళ్లా.
∙విజయ్‌ జిక్కి, బాబీ, హరనాథ్‌ బాబు

మరిన్ని వార్తలు