జిప్సీకి స్టాలిన్‌ ప్రశంసలు

5 Mar, 2020 08:35 IST|Sakshi

డీఎంకే నేత స్టాలిన్‌ ‘జిప్సీ’ చిత్రాన్ని చూసి ప్రశంసించారు. నటుడు జీవా కథానాయకుడిగా నటించిన చిత్రం జిప్సీ. ఇంతకుముందు కుక్కూ, జోకర్‌ వంటి సంచలన చిత్రాలను తెరకెక్కించిన రాజు మురుగున్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఇది. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చాలా కాలంగా సెన్సార్‌ సమస్యల్లో చిక్కుకుని ఎట్టకేలకు వాటిని అధిగమించి ఈ శుక్రవారం తెరపైకి రానుంది. కాగా ఇది ఒక గ్రామీణ సంగీత కళాకారుడి ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం. ఇందులో సమకాలీన రాజకీయాలు చోటు చేసుకోవడంతోనే సెన్సార్‌ సమస్యలను ఎదుర్కొంది. కాగా జిప్సీ చిత్రాన్ని డీఎంకే నేత స్టాలిన్‌ చూసి ప్రశంసించారని చిత్ర దర్శకుడు రాజుమురుగన్‌ తెలిపారు. గత రెండవ తేదీన జిప్సీ చిత్రాన్ని స్టాలిన్‌ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు, చిత్రాన్ని చూసిన ఆయన చిత్రం చాలా బాగుందని, సరైన సమయంలో వస్తున్న సరైన చిత్రం అని ప్రశంసించినట్లు దర్శకుడు తెలిపారు.

ప్రేమ, అభిమానం వంటి అంశాలతో పాటు సమకాలీన రాజకీయ సమస్యలను చర్చించే చిత్రంగా జిప్పీ ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇది ఒక జిప్సీ అనే సంచారి ఇతివృత్తంగా తెరకెక్కించిన కలి్పత కథా చిత్రం అని చెప్పారు. కాగా ఒక సామాజిక వర్గం హక్కులను ప్రశ్నించే చిత్రంగా జిప్పీ ఉంటుందని, పలు వివాదాప్పద సన్నివేశాలను సెన్సార్‌ కత్తెరకు బలైనట్లు తెలిసింది. మొత్తం మీద జిప్సీ చిత్రంపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. ఇందులో నటాషాసింగ్‌ నాయకిగా నటించిన ఇందులో లాల్‌జోష్‌, సన్నీ వైనీ, సుశీలారామన్, విక్రాంత్‌సింగ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఒలింపియా మూవీస్‌ పతాకంపై ఎస్‌.అంబేత్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సెల్వకుమార్, సంగీతాన్ని సంతోష్‌ నారాయణన్‌ అందించారు. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా