విమర్శలను పట్టించుకోవద్దు

22 Aug, 2017 02:00 IST|Sakshi
విమర్శలను పట్టించుకోవద్దు

తమిళసినిమా: విమర్శలను పట్టిoచుకోవద్దని నటుడు విజయ్‌ తన అభిమానులకు హితవు పలి కారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మెర్శల్‌. విజ య్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న ఇందులో ఆయనకు జంటగా సమంత, కాజ ల్‌ అగర్వాల్, నిత్యామీనన్‌లు నటిస్తున్నా రు. తెరి చిత్రం తరువాత దర్శకుడు అట్లీ, విజయ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చి త్రం ఇది. శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ పతాకంపై రామస్వామి, హేమ రుక్మిణిలు నిర్మిస్తున్న భారీ చిత్రం మెర్శల్‌. ఈ సంస్థలో రూపొందుతున్న 100వ చిత్రం కావడం విశేషం.

దీనికి ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందించారు. నటుడిగా విజయ్, సంగీత దర్శకుడిగా ఏఆర్‌.రెహ్మాన్‌ 25వ వసంతంలోకి అడుగు పెట్టడం మరో విశేషం. కాగా మెర్శల్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఆదివారం సా యంత్రం స్థానిక నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అట్లీ మాట్లాడుతూ మెర్శల్‌ చిత్రంలో పని చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర కథ గురించి చెప్పాలంటే నాగరిక యుగంలో మనం మరచిపోయిన ప్రాచీన క్రీడ జల్లికట్టును వెలుగులోకి తెచ్చినట్లుగా మరో విషయం గురించి బలంగా చెప్పే చిత్రమే మెర్శల్‌ అని పేర్కొన్నారు.

నా కొడుకే వినడు:
చిత్ర కథానాయకుడు విజయ్‌ మాట్లాడుతూ తన భాణీలతో ప్రపంచాన్నే మెప్పించి ఆస్కార్‌ అవార్డులను గెలిచిన ఏఆర్‌.రెహ్మాన్‌ ఇప్పుడీ చిత్రానికి సంగీత భాణీలు కట్టి విస్మయ పరచారన్నారు. సంగీత దర్శకుడిగా 25వ వసంతంలోకి అడుగుపెట్టిన ఏఆర్‌.రెహ్మాన్‌కు, శత చిత్ర నిర్మాణ సంస్థ శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌కు అభినందనలు తెలిపారు. అభిమానులకు సూచి స్తూ.. విమర్శల గురించి పట్టించుకోవద్దన్నారు. ఏమీ లేనప్పుడు ఆత్మవిశ్వా సం, అన్నీ ఉన్నప్పుడు అణకువ ముఖ్యం అన్నారు.

తానిలా నీతులు చెబితే తన కొడుకే వినడని, పాఠించాలా వద్దా అన్నది మీ ఇష్టం అని పేర్కొన్నారు.ఇక మెర్శల్‌ చిత్రం గురించి చెప్పాలంటే తుపాకీ ఉంటే తూటా ఉండాలి. కత్తికి షార్ప్‌ ఉండాలి. మెర్శల్‌ అదుర్స్‌గా ఉండాలి అని అన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌. రెహ్మాన్‌ సంగీత కచేరీ, కళాకారుల ఆటా పాటా ఆహుతులను ఉర్రూతలూగించాయి. సమంత, కాజల్‌అగర్వాల్, ఎస్‌జే సూర్య, పార్తీపన్, ధనుష్, శాంతను, సుందర్‌. సీ, సీ.కల్యాణ్, ఎల్‌. సురేశ్,  అభిరామి రామనాథన్, పన్నీర్‌సెల్వంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.