ఆందోళన లేదు : ప్రియాంకాచోప్రా

23 Aug, 2013 00:26 IST|Sakshi
ఆందోళన లేదు : ప్రియాంకాచోప్రా
న్యూఢిల్లీ: వరుసకు చెల్లెలైన పరిణితి చోప్రా నటించిన శుద్ధ్ దేశీ రొమాన్స్‌తో పాటుగా తాను ఆడిపాడిన జంజీర్ సినిమా ఒకేరోజు విడుదల కావడంపై ఎలాంటి ఆందోళన చెందడం లేదని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తెలిపింది. పరిణితి, ప్రియాంక నటించిన ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ ఆరున థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి. ‘ఆమె నా సోదరి. కుటుంబ సభ్యురాలు. మా ఇద్దరి మధ్య వివాదం తెచ్చేలా కొంత మంది చీప్‌గా రాతలు రాస్తున్నారు. మా గురించి కొంచెం అతి చేస్తున్నారు. 
 
 అది సమంజసం కాదు. వారాంతంలో విడుదలయ్యే జంజీర్ సినిమాను చూసి ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేయాల’ని ప్రియాంక మీడియాకు తెలిపారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి పోటీ లేదని చెప్పింది. అయితే డిస్నీ నిర్మిస్తున్న ప్లేన్స్ సినిమాకు డబ్బింగ్ చెప్పానని, ఇండియన్ ప్లేన్‌కు స్వరాన్ని అందించానని తెలిపింది. ప్రతి బాలిక డిస్నీ ప్రిన్సెస్ కావాలనుకుంటుంది. నేను కూడా అంతేనని తెలిపింది. 
 
 ఈ సినిమా చూసినప్పుడు నా గొంతుతో విమానం మాట్లాడటం చూసి ఉబితబ్బిబైపోయానని చెప్పింది. ఇది విభిన్న సృజనాత్మకతతో కూడుకున్నది. ఇదొక మంచి నవల లాంటిదని తెలిపింది. డిస్నీ ప్రిన్సెస్ ఇషాని పాత్రకు, తనకు కొన్ని ఒకే తరహా లక్షణాలున్నాయని చెప్పింది. ‘అతి విశ్వాసం ఉంటుంది. చెడు బాలురతో ఆడుతా. కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తాన’ని తెలిపింది. 
 
 తాను ఎక్కడున్నా నటన పట్ల ఆసక్తిని కనబరుస్తానని వ్యాఖ్యానించింది. ‘వినోదం అందిస్తా. అద్భుతంగా నటిస్తా. ఎక్కడ పని ఉన్నా వెళతా. నా హద్దుమీరి ప్రవర్తించన’ని తెలిపింది. భారత సినిమా పరిశ్రమలో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించింది. ఎక్కువగా హిందీ సినిమాలను ఇష్టపడతానని చెప్పింది. ప్రతి ఒక్కరూ ఎదగాలనుకుంటారు. దానికి తాను కూడా అతీతురాలినేమీ కాదని ప్రియాంకాచోప్రా వివరించింది.
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి