సినిమా రివ్యూలపై నిర్మాతల మండలి చిర్రుబుర్రులు

25 Apr, 2015 19:22 IST|Sakshi
సినిమా రివ్యూలపై నిర్మాతల మండలి చిర్రుబుర్రులు

హైదరాబాద్: సినిమా రివ్యూలపై నిర్మాతల మండలి చిర్రుబుర్రులాడింది. మీడియా ఇచ్చే రివ్యూల వల్ల సినీపరిశ్రమకు నష్టాలు వస్తున్నట్లు మండలి తెలిపింది. సినిమా విడుదల కాగానే రివ్యూలు రాసే సంస్కృతిని మీడియా మానుకోవాలని కోరింది. చిత్ర పరిశ్రమ ఎటక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియా సహకారం కోరుకుంటున్నట్లు తెలిపింది.

నిర్మాతల మండలి ప్రత్యేకంగా ఏ ఛానళ్లతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపింది. ఏ నిర్మాత అయినా, ఏ ఛానల్తోనైనా ఒప్పందం కుదుర్చుకొని సినిమా ప్రచారం చేసుకోవచ్చునని పేర్కొంది.