ఈ హీరోయిన్‌ స్పెషల్‌ ఏంటో తెలుసా?

6 Jul, 2017 19:58 IST|Sakshi
ఈ హీరోయిన్‌ స్పెషల్‌ ఏంటో తెలుసా?

చెన్నై: ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక స్పెషల్‌ క్వాలిటీ ఉంటుంది. అలా నటి అమలాపాల్‌లోనూ ఒక ప్రత్యేకత ఉంది. అది ఈ అమ్మడి సినీ కేరీరే. పెళ్లికి ముందు, ఆ తరవాత అని ఆమె కెరీర్‌ను విభజించవచ్చు. పెళ్లికి ముందు హీరోయిన్‌గా నటించింది తక్కువ చిత్రాలే అయినా అమ్మడు మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఇక పెళ్లి, విడాకులతో కొంచెం తడబడినా తాజాగా మళ్లీ గాడిలో పడిందని చెప్పవచ్చు. అయితే రీఎంట్రీలో ఇప్పటి వరకూ అమలాపాల్‌ కు సరైన హిట్‌ పడలేదు.

త్వరలో ధనుష్‌తో రొమాన్స్‌ చేసిన వీఐపీ 2 చిత్రం తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీనిపైనే అమలాపాల్‌ చాలా ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం తిరుట్టుప్పయలే 2, భాస్కర్‌ ఒరు రాస్కెల్, రెండు మలయాళ చిత్రాలు చేతిలో ఉన్నాయి. మరో తమిళ చిత్రానికి సంతకం చేసినట్లు సమాచారం. ఇకపోతే అమలాపాల్‌లో మంచి చెఫ్‌ ఉందట. సమయం దొరికినప్పుడల్లా వంటింట్లోకి ప్రవేశించి రకరకాల చేపల కూరలను వండుతుందట. అదే విధంగా ఒంటరిగా ప‍్రయాణాలు చేయటం అమల హ్యాబీల్లో ఒకటట.