రజనీ ఏ హీరోలను ఫాలో అవుతారో తెలుసా?

27 Jul, 2016 08:44 IST|Sakshi
రజనీ ఏ హీరోలను ఫాలో అవుతారో తెలుసా?

సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా కేవలం తమిళనాడుకో, తెలుగు రాష్ట్రాలకో మాత్రమే పరిమితం కాలేదు.. దేశం మొత్తానికి ఆయన తన సత్తా చూపించారు. కబాలి సినిమా ఇటు దక్షిణాది నుంచి అటు ఉత్తరాది వరకు చాలా రాష్ట్రాలలో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇంత పేరున్న రజనీకాంత్ను ట్విట్టర్లో దాదాపు 30 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. మరి రజనీ ఎవరిని ఫాలో అవుతున్నారు.. ఎంత మందిని ఫాలో అవుతున్నారో అనే విషయం కూడా ఆసక్తికరమే కదా.. ఆయన ఫాలో అయ్యే వ్యక్తులు ఇద్దరే ఇద్దరు.. వాళ్లలో ఒకరు బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కాగా, మరొకరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ!!

అవును ఒకవైపు హిందీ సినిమాల్లో అగ్రస్థానంలో ఉన్న పెద్ద హీరోను ఫాలో అవుతున్న రజనీ కాంత్, అదే సమయంలో ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కేంద్రస్థానంలో ఉన్న మోదీని ఫాలో అవ్వడం అంటే ఒక రకంగా పెద్ద విశేషమే. వీళ్లిద్దరూ కాక ప్రధానమంత్రి కార్యాలయాన్ని, కొన్ని జాతీయ వార్తా సంస్థలను కూడా రజనీ ఫాలో అవుతున్నారు. అంతా కలిపి ఆయన ఫాలో అయ్యేది కేవలం 19 అకౌంట‍్లు మాత్రమే. అదీ సంగతి!!

>