అప్పటి వరకు రూపాయి తీసుకోను!

5 Aug, 2018 03:00 IST|Sakshi
ఆమీర్‌ ఖాన్‌

ఆమీర్‌ ఖాన్‌ సినిమా చేయడానికి ఒప్పుకుంటే చాలు ప్రొడ్యూసర్‌ అడ్వాన్స్‌ రూపంలో భారీ మొత్తాన్ని ముట్టజెప్పుకోవాల్సిందే. సినిమాలో ఆమిర్‌ పారితోషికం మిగతా వారి కంటే చాలా ఎక్కువ... ఇలాంటి వార్తలు బీ టౌన్‌లో వినిపిస్తూ ఉంటాయి. రీసెంట్‌గా ఇండియన్‌ స్క్రీన్‌ రైటర్స్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఇదే క్వశ్చన్‌ను ఆమీర్‌ ఖాన్‌ను డైరెక్ట్‌గా అడిగేశారు. ఈ ప్రశ్నకు ఆమీర్‌ బదులిస్తూ– ‘‘నిర్మాతలు సినిమా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతోనే డబ్బులు ఖర్చు పెడతారు. ఒకవేళ మూవీ ఫ్లాప్‌ అయితే ఆ బాధ్యత అందరిదీ. నిర్మాతది మాత్రమే కాదు.

అందుకే సినిమా రిలీజై హిట్‌ టాక్‌ తెచ్చుకుని ప్రొడ్యూసర్‌ ప్రాఫిట్లో ఉన్నారని తెలిశాకే నా పారితోషికం తీసుకుంటాను. అప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకోను. సినిమా కలెక్షన్స్‌ బాగా ఉన్నప్పుడు నా పారితోషికం చాలా ఎక్కువగా ఉండొచ్చు. కానీ రిలీజ్‌ కాకముందు నేను విలువైన సమయాన్ని రిస్క్‌గా పెట్టానని మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ సినిమా ఫ్లాప్‌ అయితే ఆ ప్రొడ్యూసర్‌ నాతో మరో సినిమా తీయడానికి ముందుకు వస్తారా? లేదా? అనే భయం కూడా ఉంటుంది. ఆర్థికంగా నష్టపోతే మళ్లీ నాతో సినిమా చేయాలని ఎందుకనుకుంటారు. అందుకే నిర్మాత నష్టపోకూడదని కోరుకుంటా’’ అన్నారు ఆమీర్‌. ఈ ఫార్ములాను ఆయన ‘లగాన్‌’ నుంచి ఫాలో అవుతున్నారట.

మరిన్ని వార్తలు