రామానాయుడు విగ్రహావిష్కరణ

7 Jun, 2019 00:52 IST|Sakshi
అభిరామ్, ఆదిశేషగిరిరావు, సురేష్‌బాబు, రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌

మూవీ మొఘల్, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడు జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ చాంబర్‌ ఆవరణలో గురువారం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత, రామానాయుడు కుమారుడు దగ్గుబాటి సురేశ్‌బాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు రామానాయుడు అందించిన సేవలను అతిథులు కొనియాడారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, ఫిల్మ్‌నగర్‌ సొసైటీ అధ్యక్షులు జి. ఆదిశేషగిరిరావు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, నటులు కైకాల సత్యనారాయణ, గిరిబాబు, కోట శ్రీనివాసరావు, ఆర్‌.నారాయణమూర్తి, విజయ్‌చందర్, శివకృష్ణ, కేఎల్‌ నారాయణ, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, దర్శకుడు బి.గోపాల్, నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్‌ కుమార్, బోయిన సుబ్బారావు, జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు