వాళ్లంతా వెంకటేశ్ పేరే చెప్పారు: శ్రీప్రియ

27 Jul, 2014 13:51 IST|Sakshi
వాళ్లంతా వెంకటేశ్ పేరే చెప్పారు: శ్రీప్రియ

‘‘యాభై ఏళ్ల మా సంస్థ చరిత్రలో తొలిసారి లేడీ డెరైక్టర్‌తో నిర్మించిన చిత్రం ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది. ఇక్కడే కాదు.. విదేశాల్లోనూ ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది’’ అని డి. రామానాయుడు చెప్పారు. వెంకటేశ్, మీనా జంటగా శ్రీప్రియ దర్శకత్వంలో రామానాయుడు సమర్పణలో డి. సురేశ్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి నిర్మించిన ‘దృశ్యం’ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది.
 
  ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ- ‘‘నటుడిగా నాలో ఆత్మవిశ్వాసం పెంచిన చిత్రం ఇది. నా కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు. ‘‘మలయాళ ‘దృశ్యం’ని తెలుగులో రీమేక్ చేస్తు, హీరోగా ఎవరైతే బాగుంటుందని నా స్నేహితురాళ్లు జయప్రద, జయసుధ, రాధికను అడిగితే.. వెంకటేశ్ పేరు చెప్పారు. తనతో సినిమా చేయడం ఓ మంచి అనుభవం’’ అని శ్రీప్రియ తెలిపారు. పరుచూరి గోపాలకృష్ణ, రాజ్‌కుమార్ సేతుపతి, మీనా, నదియా తదితరులు చిత్రవిజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)