‘ఈ పాటను ప్రేమతో నింపేయండి సర్‌’

1 Mar, 2020 13:10 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. దర్శకుడు సుకుమార్‌ దగ్గర అసోసియేట్‌గా పని చేసిన బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కథానాయికగా కృతీ శెట్టి నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లను చిత్ర బృందం అప్పుడే ప్రారంభించింది. ఇందులో భాగంగా సినిమాలోని తొలి పాటను సోమవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ చిన్న వీడియోను కూడా రిలీజ్‌ చేసింది. 

60 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో సముద్రపు ఒడ్డును సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో దర్శకుడు బుచ్చిబాబు మ్యూజిక్‌ సిట్టింగ్‌ చేశారు. ‘హీరో దర్గా దగ్గర ఫస్ట్‌ టైమ్‌ హీరోయిన్‌ను చూస్తాడు. చూసి ఆ దేవుడికి పెట్టే దండం.. అదే దండం ఈ అమ్మాయికి పెడతాడు. అప్పుడు దర్గానుంచి వచ్చే కవాలి మ్యూజిక్‌తో మంచి సాంగ్‌ ఇవ్వండి. ఈ పాటను ప్రేమతో నింపేయండి సర్‌’అంటూ డైరెక్టర్‌ రాక్‌స్టార్‌ను కోరతాడు. ‘ప్రేమ ఒక సముద్రం.. అందులో వాడిదొ పడవ ప్రయాణం అనే చిన్న ఐడియా వచ్చింది సర్‌’ అంటూ ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే సాంగ్‌ను దేవి అందుకుంటాడు. లిరిక్స్‌, ట్యూన్‌ నచ్చడంతో ఈ పాటకు డైరెక్టర్‌ ఓకే చెప్పేస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో ఆసక్తికరంగా ఉండటంతో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇక అలా.. అలల మధ్య పుట్టిన ప్రేమ పాటను దేవి ఏ రేంజ్‌లో కంపోజ్‌ చేశాడో తెలియాలంటే రేపటివరకు వేచిచూడాలి.

చదవండి:
ఈ వారం మాకెంతో స్పెషల్‌
మరో మర్చిపోలేని సంక్రాంతి.. అందరికీ థ్యాంక్స్‌​​​​​​​

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు