డబ్బింగ్‌ మొదలెట్టిన చిరు చిన్నల్లుడు

17 May, 2018 11:54 IST|Sakshi

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెర మీద సందడి చేయనున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా త్వరలో రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాకేష్‌ శశి దర‍్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.

కల్యాణ్ సరసన మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు... ‘అర్జున్‌ రెడ్డి’కి నేపథ్య సంగీతమందించిన హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతమందిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప‍్రమోషన్‌ కార్యక్రమాలు త్వరలో  ప్రారంభించనున్నారు.

మరిన్ని వార్తలు