ఫుల్‌ జోష్‌

10 Nov, 2018 01:33 IST|Sakshi
దుల్కర్‌ సల్మాన్‌

విభిన్నమైన పాత్రలు పోషిస్తూ సౌత్‌లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. ఈ ఏడాది ‘కర్వాన్‌’ సినిమాతో బాలీవుడ్‌ గడప తొక్కిన దుల్కర్‌ ప్రస్తుతం ‘జోయా ఫ్యాక్టర్‌’ అనే మరో హిందీ సినిమా చేస్తున్నారు. నార్త్, సౌత్‌ సినిమాల్లో అవకాశాలను చేజిక్కించుకుంటూ ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆయనకు తాజాగా ‘ఇండియన్‌ 2’ చిత్రంలో నటించే చాన్స్‌ వచ్చిందని కోలీవుడ్‌ టాక్‌.

శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ‘ఇండియన్‌ 2’ సీక్వెల్‌. శంకర్‌ –కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లోనే తెరకెక్కనున్న ఈ చిత్రంలో కాజల్‌ కథానాయికగా ఎంపికయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దుల్కర్‌ పేరు తెరపైకి వచ్చింది. ‘ఇండియన్‌ 2’ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు