‘నువ్వు ఎప్పటికీ మా చిన్నారివే డార్లింగ్‌ మేరీ’

5 May, 2020 20:28 IST|Sakshi

లాక్‌డౌన్‌ కాలాన్ని నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తన భార్య అమల్‌ సుఫియా, కూతురు మరియం అమీరా సల్మాన్‌తో ఉల్లాసంగా గడుపుతున్నారు. మంగళవారం ఈ మలయాళ నటుడు కూతురు మూడవ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ క్రమంలో దుల్కర్‌ తన కూతురుకి బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ.. కూతురితో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అలాగే కూతురుపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టు చేశారు. (అంబానీ కుటుంబానికి కృతజ్ఞతలు‌)

‘హ్యాపీయెస్ట్‌ బర్త్‌డే డార్లింగ్‌ మేరీ.. ‘నేను ఇప్పుడు పెద్ద అమ్మాయిని’ అని నువ్వు చెప్పింది నిజమే. నువ్వు త్వరగా పెరుగుతూ, మాటలు పూర్తిగా నేర్చుకుంటున్నావు. నీకు మూడు సంవత్సరాలు నిండాయి. పెద్దదానివి అయిపోయావు. నీ యువరాణి దుస్తుల్లో చకాచకా తిరుగుతున్నావు‌. మాకు కథలు చెబుతున్నావు. అవును నువ్వు ఇప్పుడు పెద్ద అమ్మాయివి. సొంతంగా నడవడం నేర్చుకున్నావు. ఇప్పుడే పరుగెత్తుతున్నావు. అవును నువ్విప్పుడు పెద్ద అమ్మాయివి. కానీ మాకు నువ్వింకా చిన్నపిల్లలాగే ఉన్నావు. ఎప్పుడైతే మేము నిన్ను మొదటిసారి చూశామో  ఆ రోజులా. ఆ రోజు మేము తొలిసారి ఓ దేవతను చూశాము. నువ్వు ఎదుగుతున్నా.. మాకు చిన్నపాపలాగే మాకు కనిపిస్తున్నావు. నువ్వు ఎప్పటికీ మా చిన్నారివే. నువ్వు పెద్దదానివి అయ్యావని ప్రపంచమంతా చెప్పినా.. మాకు నువ్వు చిన్న పిల్లవే డార్లింగ్‌ మేరీ’’. అంటూ కూతురిపై తన ప్రేమను చాటుకున్నారు. (మీరందరూ సూపర్‌ హీరోలే: అనిల్‌ కపూర్‌)
చదవండి: (కత్రినాపై రణ్‌బీర్‌కు ఎంత ప్రేమో!’)

Happiest birthday darling Marie. You’ve got every one of us acting your age while you insist, “Im a big girl now!” Maybe you’re right. You’re fast growing up, speaking in full sentences now. 3 years old you’re a big girl now. Twirling in your princess dresses. Creating your own games now. Telling us stories, you’re big girl now. Walking on your own. Running now. Learning how to jump, you’re a big girl now. Slow down darling Marie, be a baby still. Like the day we saw you for the first time. Held you and heard your cries for the first time. The day they thronged the hallways, to meet an angel for the first time. Be that baby girl still, we havnt had enough. Though forever more you’re our baby. Even when the world says, she’s a big girl now. Don’t rush, darling Marie, stay our baby girl still. #pappasattemptatapoem #youhavethateffectonus #happymaryamday #myangelbaby #cantbelieveit #youarethreeyearsold #loveyoutothemoonandback #ourbabygirl

A post shared by Dulquer Salmaan (@dqsalmaan) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు