ఓట్లేసిన తారలకు పాట్లు

26 Apr, 2019 10:19 IST|Sakshi

పెరంబూరు: ఓట్లేసిన తారలు కొందరు ఇప్పుడు పాట్లకు గురవుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు దాదాపుగా ప్రశాంతంగా జరిగాయనుకుంటున్న సమయంలో కొందరు ఓట్లేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలో నటుడు శివకార్తికేయన్, అజిత్, శ్రీకాంత్‌ వంటి వారి ఓటు హక్కును వినియోగించుకున్న విధానం విమర్శలకు తావిచ్చింది. దీంతో కొందరు పోలింగ్‌ అధికారులకు వేటు పడే అవకాశం ఏర్పడనుంది. నటుడు శివకార్తికేయన్‌ పేరు ఓటరు పట్టికలో లేకపోయినా ఆయన్ని ఓటు వేయడానికి అధికారులు అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా మరో నటుడు శ్రీకాంత్‌ ఓటు వేయడంపైనా ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రతసాహూ అధికారులను వివరణ కోరారు. వారిపై ఎన్నికల శాఖ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు.

ఇక ప్రముఖ నటుడు అజిత్‌ వరుసలో నిలబడ కుండా నేరుగా బూత్‌ వద్దకు వెళ్లి ఓటు వేయడం పైనా విమర్శలు వస్తున్నాయి. దీనిపైనా విచారణ జరుపుతామని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.అంతే కాకుండా ఓట్ల లెక్కింపు సమయంలో జయాపజయాలను ఒక్క ఓటు నిర్ణయంచే పరిస్ధితి సంభవిస్తే వీరి ఓట్లను పరిగణలోకి తీసుకోవడం జరగదని పేర్కొన్నారు. కాగా తన ఓటు హక్కును వినియోగించుకోవడం గురించి నటుడు శ్రీకాంత్‌ వివరణ ఇస్తూ ఎన్నికల నిర్వాహకులు ఆక్షేపణ లేదని చెప్పడంతోనే  స్థానిక సాలిగ్రామంలోని కావేరి పోలీంగ్‌ బూత్‌లో తాను ఓటు వేసినట్లు తెలిపారు. తన ఆధార్‌ కార్డులో నూతన ఇంటి చిరునామా ఉండటం వల్లే తన పేరు లేక్‌ ఏరియా ఓటరు పట్టికలోకి మారిందని, ఈ విషయం గురించి నిర్వాహకులెవరూ వివరించలేదని అన్నారు. ఇలాంటి విషయాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

కాగా నటుడు అజిత్,తన భార్య  శాలినితో కలిసి  పోలింగ్‌ బూత్‌కు కారులో వచ్చారు. దీంతో వారు వచ్చిన విషయం తెలిసి అక్కడ ఉన్న జనం కారును చుట్టు ముట్టారు.అందువల్ల అజిత్‌ శాలిని దంపతులు కిందకు దిగకుండా కారులోనే ఉండిపోయారు. దీంతో పోలీసులు వచ్చి అజిత్,శాలినిలను పోలీంగ్‌ బూత్‌ వద్దకు తీసుకెళ్లారు. ఇది విమర్శలకు దారి తీసింది. నటులకో విధానం, సామాన్య ప్రజలకు మరో విధానమా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపైనా ఎన్నికల ప్రధాన అధికారి వివరణ కోరినట్లు తెలిపారు.ఈ వ్యహారం చూస్తుంటే ఎంకి పెళ్లి సుబ్బు చావు కొచ్చినట్లు, ఎన్నికల నిర్వాహకులు చర్యలకు గురైయ్యే పరిస్థితి నెలకొంది. ఇక నటులు ఇవేం పాట్లురా బాబూ అని తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘జాతీయ అవార్డు అవసరం లేదు’

రైనా ప్రశ్నకు సూర్య రిప్లై

‘పిల్లలు కావాలి కానీ తల్లి వద్దు’

ప్రభుదేవా, తమన్నా రేర్‌ రికార్డ్‌!

విజయ్‌ దేవరకొండ ‘బ్రేకప్‌’!

‘దొరసాని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ఎలా డేటింగ్‌ చేయాలో తెలియదు

అలాంటి అనుభవాలు మాకే లభిస్తాయి : కాజల్‌

పొట్టి చిత్రాల పి.సి.శ్రీరామ్‌

మంచిగైంది

ఆ పరీక్షలో పాసయ్యాం

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

సినిమానే పెళ్లి చేసుకున్నాడు..

సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి

‘సాహో’పై స్పందించిన అనుష్క

అసభ్య మెసేజ్‌; చిన్మయి అల్టిమేట్‌ రిప్లై!

నాకేం పనిలేదా?: సల్మాన్‌ ఫైర్‌

‘మా నమ్మకాన్ని మరింత పెంచింది’

సాహో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది!

క్షమాపణలు చెప్పిన వివేక్‌ ఒబేరాయ్‌

రాజకీయాల్లోకి వస్తా : ప్రముఖ హాస్యనటుడు

ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు

పాతికేళ్ల కల నెరవేరింది

పాము ప్రేమిస్తే?

సమస్యలపై మేజర్‌ పోరాటం

రెండింతలు భయపెడతాం

చంద్రబోస్‌కి మాతృవియోగం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘జాతీయ అవార్డు అవసరం లేదు’

ప్రభుదేవా, తమన్నా రేర్‌ రికార్డ్‌!

విజయ్‌ దేవరకొండ ‘బ్రేకప్‌’!

‘పిల్లలు కావాలి కానీ తల్లి వద్దు’

‘దొరసాని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సినిమానే పెళ్లి చేసుకున్నాడు..