విజయ్‌ పెద్ద స్టార్‌గా ఎదగాలి

23 Apr, 2019 00:33 IST|Sakshi
విజయ్‌ రాజా, వీవీ వినాయక్, రమాకాంత్, శివాజీ రాజా

– వీవీ వినాయక్‌

‘‘నేను అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పటి నుంచి శివాజీరాజాతో పరిచయం ఉంది. మంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు హీరోగా పరిచయమవుతోన్న ఆయన తనయుడు విజయ్‌ పెద్ద స్టార్‌గా ఎదగాలి. ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్‌ అన్నారు. నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్‌ రాజా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. పూజా సోలంకి, సాషాసింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె.రమాకాంత్‌ దర్శకత్వంలో వెట్‌ బ్రెయిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్, సుధర్మ్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని వినాయక్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – ‘‘ఏదైనా జరగొచ్చు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెడుతున్న మా అబ్బాయి విజయ్‌ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి. వినాయక్‌గారి చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఆయనకు నా స్పెషల్‌ థాంక్స్‌’’ అన్నారు. ‘‘ఇదొక క్రైమ్‌ హారర్‌ థ్రిల్లర్‌. మంచి సహకారం అందిస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌’’ అన్నారు రమాకాంత్‌. బాబీ సింహా, నాగబాబు, అజయ్‌ ఘోష్, ‘వెన్నెల’ కిషోర్, పృథ్వి, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: సుదర్శన్‌ హనగోడు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ ప్రకాశ్‌ అన్నంరెడ్డి, కెమెరా: సమీర్‌ రెడ్డి, సంగీతం: శ్రీకాంత్‌ పెండ్యాల.

మరిన్ని వార్తలు