సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

21 Aug, 2019 02:28 IST|Sakshi

– శివాజీ రాజా

‘‘దాదాపు 35 ఏళ్ల క్రితం ‘కళ్ళు’ సినిమా ద్వారా నేను హీరోగా పరిచయమయ్యా. ఆ సినిమా నాకు 17 అవార్డులు తీసుకొచ్చింది. ఆ చిత్రంలో హీరో నేనే అయినా గొల్లపూడిగారు, రఘుగారే హీరోలని ఇప్పటికీ చెబుతుంటాను. ఎందుకంటే రచయిత, దర్శకుడే సినిమాకు ప్రాణం. ‘ఏదైనా జరగొచ్చు’ సినిమా కూడా రమాకాంత్‌దే’’ అని శివాజీ రాజా అన్నారు. ఆయన తనయుడు విజయ్‌ రాజా హీరోగా, పూజా సోలంకి, సాషా సింగ్‌ హీరోయిన్లుగా కె. రమాకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’.

సుదర్శన్‌ హనగోడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న కె.ఎఫ్‌.సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా రిలీజ్‌ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో బాబీ సింహా మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు ఇలాంటి కథను దర్శకుడు ఎలా ఆలోచించారు? ఎలా సీన్లు రాసుకున్నారు? వాటిని ఎలా కనెక్ట్‌ చేశారు? అని ఆశ్చర్యపోయాను. విజయ్‌ రాజాకి తొలి సినిమా అయినా బెరుకు లేకుండా నటించాడు’’ అన్నారు. ‘‘ఇదొక డార్క్‌ కామెడీ హారర్‌ థ్రిల్లర్‌. తెలుగు స్క్రీన్‌పై ఇప్పటి వరకు చూడని ప్రేమకథ మా సినిమాలో చూస్తారు’’ అన్నారు రమాకాంత్‌.

‘‘ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు నాలుగు ఏళ్ల క్రితం స్టార్ట్‌ అయింది. అన్ని పాటలు అప్పుడే కంపోజ్‌ చేశాం’’ అన్నారు శ్రీకాంత్‌ పెండ్యాల. ‘‘జిగర్తండా’లో బాబీ సింహాగారి నటన చూసి ఆయనతో కలిసి నటించాలనుకున్నా. నా ఫస్ట్‌ సినిమాకే ఆ అవకాశం రావడం అదృష్టం’’ అన్నారు విజయ్‌ రాజా. ‘‘ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సుదర్శన్‌ హనగోడు. ఈ చిత్రానికి సహ నిర్మాత: పి. సుదర్శన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ప్రకాష్‌ అన్నంరెడ్డి, కెమెరా: సమీర్‌రెడ్డి.
∙సుదర్శన్, బాబీ సింహా, శివాజీరాజా, విజయ్‌ రాజా,  రమాకాంత్‌

మరిన్ని వార్తలు