ఆ రోజు వచ్చింది

18 Jan, 2018 04:57 IST|Sakshi
సుబ్రహ్మణ్యం, ఆశిష్‌ రాజ్‌

‘‘ఆకతాయి’ సినిమాలో కాలేజ్‌ కుర్రాడిలా నటించాను. ‘ఇగో’లో బాధ్యతలను నిర్లక్ష్యం చేసి లైఫ్‌ను ఎంజాయ్‌ చేసే గోపీ పాత్రలో నటించాను. ఎమోషన్స్‌తో రూపొందిన మా చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు ఆశిష్‌ రాజ్‌. ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఆయన హీరోగా విజయ్‌ కరణ్, కౌషల్‌ కరణ్, అనిల్‌ కరణ్‌ నిర్మించిన చిత్రం ‘ఇగో’. సిమ్రాన్‌ కథానాయికగా నటించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఆశిష్‌ రాజ్‌ చెప్పిన విశేషాలు.

► ఇగో ఫీలయ్యే ఇద్దరు (గోపీ, ఇందు) వ్యక్తుల మధ్య ఎమోషన్స్‌తో సాగే లవ్‌స్టోరీ ఇది. సినిమాలో విలేజ్, సిటీ కల్చర్‌ మిక్సై ఉంటుంది. నటుడిగా నాకు మంచి గుర్తింపు తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది. అమలాపురం యాసలో నేను చెప్పే డైలాగ్స్‌ బాగుంటాయి. కైరాదత్‌ చేసిన స్పెషల్‌ సాంగ్‌ సూపర్‌గా ఉంటుంది. దర్శకుడు సుబ్రహ్మణ్యం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సాయి కార్తీక్‌ సంగీతం స్పెషల్‌ ఎట్రాక్షన్‌. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.

► చిన్నతనం నుంచే యాక్టింగ్‌ అంటే ఇంట్రెస్ట్‌. చదువు పూరై్తన తర్వాత మా నాన్నగారు ప్రోత్సహించారు. బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో రాణించడం కష్టమే. కానీ నాకు దేవుడి అండ తోడుగా ఉంటుందనుకుంటున్నాను. మహేశ్‌బాబుతో ఓ యాడ్‌ ఫిల్మ్‌ చేస్తున్నప్పుడు దేవుడా.. నా కంటూ ఓ రోజు రావాలని మనసులో అనుకున్నాను. అదే నిజమైంది. నెక్ట్స్‌ సినిమా గురించి ఇంకా ఏమి అనుకోలేదు.

ఆశిష్‌ నా బర్త్‌డే గిఫ్ట్‌!
‘ఇగో’ చిత్రదర్శకుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ – ‘‘మా హీరోనే నా పుట్టినరోజు కానుక. ఆశిష్‌ రాజ్‌ సూపర్‌గా నటించాడు. హీరోయిన్‌ సిమ్రాన్‌ బాగా నటించింది. మా సినిమాలో నటించిన సీనియర్‌ యాక్టర్స్‌ అందరూ ఎంతగానో హెల్ప్‌ చేశారు. వారిని మర్చిపోలేను. కథ విషయానికొస్తే.. పల్లెటూరి  నుంచి పట్నానికి వచ్చే ప్రేమకథ ఇది. ఆ తర్వాత ఏం జరిగిందనేది స్క్రీన్‌పై చూస్తేనే బాగుంటుంది. స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు’’ అన్నారు.

మరిన్ని వార్తలు