‘మరీ ఇంత దారుణంగా ఉంటే ఎలా..!?’

27 Jul, 2018 12:26 IST|Sakshi
ఏక్తా కపూర్‌

ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్‌‌, ఎమోషనల్‌ స్టోరీస్‌ ఇలా ఒకటేమిటి వైవిధ్యమైన కథలతో సీరియళ్లను నిర్మిస్తోన్న బాలాజీ టెలీఫిల్మ్స్‌ అధినేత్రి ఏక్తా కపూర్‌కు.. ‘క్వీన్‌ ఆఫ్‌ హిందీ టెలివిజన్‌’  అనే బిరుదు ఎప్పుడో కట్టబెట్టేశారు ఆమె అభిమానులు. కానీ ఇప్పుడు ఆ అభిమానులే ఏక్తాకు అస్సలు టేస్ట్‌ లేదంటూ పెదవి విరిచేస్తున్నారు. ఇందుకు ఆమె నిర్మించే సీరియళ్లు మాత్రమే కారణం కాదు. అసలు విషయమేమిటంటే... ఓ ప్రముఖ హిందీ చానల్‌లో ప్రసారమవుతోన్న ‘యే హై మొహబ్బతే’  సీరియల్‌ 15 వందల ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏక్తా కపూర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో స్లీవ్‌లెస్‌ మెరూన్‌ రఫెల్‌ గౌనుకు జోడీగా బ్లూ కలర్‌ డెనిమ్‌ జీన్స్‌ ధరించిన ఏక్తా.. బ్లాక్‌ హీల్స్‌ వేసుకున్నారు. పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో ఏక్తా నెటిజన్ల చేతికి చిక్కారు. ఇంకేముంది అప్పటి నుంచి ఏక్తా డ్రెస్‌ గురించి తెగ ట్రోల్‌ చేసేస్తున్నారు.

‘సాగతీత కథనాలతో చిరాకు తెప్పించినా సహిస్తామేమో గానీ.. మీరు ఇలా ఉండటాన్ని మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాం.. డైనింగ్‌ హాలు నుంచి వస్తూ వస్తూ కర్టెన్‌ కప్పుకచ్చుకున్నారా ఏంటి? అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘ఎంత డబ్బు ఉంటే ఏం లాభం..కనీసం ఓ స్టైలిస్ట్‌ను ఐనా పెట్టుకోవచ్చుగా’ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు.  మరో అభిమాని స్పందిస్తూ.. ‘మా అభిమాన తార ఫ్యాషన్‌ ఐకాన్‌గా ఉండకపోయినా ఫర్వాలేదు.. మరీ ఇంత దారుణంగా ఉంటే మాత్రం సహించలేమంటూ’వాపోయాడు. అయితే ఏక్తాకు ఇదేం కొత్త కాదు. ఇది వరకు కూడా లాజిక్‌ లేని మాటలు, వెరైటీ డ్రెస్సులతో ఎన్నోసార్లు ట్రోలింగ్‌ ఎదుర్కొన్నారు.

The queen of tv land arrives #ektakapoor for #yehhainmohabatein 1500 episodes celelberations @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు