నేలపై నిద్రపోతున్న హీరోయిన్‌

1 Jul, 2019 05:38 IST|Sakshi
ఎమ్మా స్టోన్‌

హాలీవుడ్‌ సూపర్‌ నటి ఎమ్మా స్టోన్‌ నేలపై నిద్రపోతున్నారట. రెండేళ్ల క్రితం ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా గుర్తింపు పొందిన ఈ హీరోయిన్‌కు ఎందుకు ఇంత కష్టం వచ్చిందంటే... అక్కడికే వస్తున్నాం. ఇటీవల ఆమె భుజానికి పెద్ద దెబ్బ తగిలిందని హాలీవుడ్‌ టాక్‌. దీంతో డాక్టర్‌ ఆమెకు దాదాపు రెండు నెలలు రెస్ట్‌ తీసుకోమని చెప్పారట. అలాగే నేలపై నిద్రపొమ్మని చెప్పారట. స్టార్‌ నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఎమ్మాకు ఎంత కష్టం వచ్చిందని ఆమె ఫ్యాన్స్‌ బాధపడిపోతున్నారు. ప్రస్తుతం ‘క్రూయెల్లా’ అనే హాలీవుడ్‌ మూవీ కమిట్‌ అయ్యారు ఎమ్మా. అయితే ఇంకా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌లో ఉండటంతో ఎమ్మా గాయం ఈ సినిమాపై పడే ప్రభావం లేదంటున్నారు ఆమె సన్నిహితులు. ఇంతకీ ఎమ్మా భుజానికి ఎలా గాయం అయిందీ అంటే.. కొందరేమో షూటింగ్‌ లొకేషన్లో అని, కొందరేమో ఇంట్లో జారిపడ్డారని అంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు