'కావాలనే బోరింగ్ పర్సన్‌లా కనిపిస్తా'

14 Jan, 2016 09:59 IST|Sakshi
'కావాలనే బోరింగ్ పర్సన్‌లా కనిపిస్తా'

లండన్: బహిరంగ ప్రదేశాల్లో తాను పెద్ద చురుగ్గా కనిపించనని, బోరింగ్‌ పర్సన్‌ (పెద్దగా ఆసక్తి లేని వ్యక్తి)లా ఉండటానికే ఇష్టపడుతానని చెపుతోంది హాలీవుడ్ హీరోయిన్‌ ఎమ్మా వాట్సన్‌. 'హ్యారీపొటర్‌' సిరీస్‌ చిత్రాల్లో హెర్మియన్ గ్రాంజర్‌గా నటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది ఈ సుందరి. అయితే లైమ్‌లైట్‌లో ఉండి ప్రజల అందరి దృష్టి తనవైపు తిప్పుకోవడం అసలు ఇష్టం ఉండదని, తన ప్రైవసిని కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తానని ఆమె చెపుతోంది.

'నేను చాలా బోరింగ్ పర్సన్‌లా అందరికీ కనిపించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. నన్ను నేనుగా గుర్తుంచుకొని ప్రైవసీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తా. ఉదాహరణకు రెడ్‌కార్పెట్‌పై నడుస్తున్నప్పుడు కాస్తా స్తబ్దుగా, నాలో నేను ఉన్నట్టు కనిపిస్తా' అని ఎమ్మా వాట్సన్ పోర్టర్‌ మ్యాగజీన్‌కు తెలిపింది. 'నాకు ఇప్పుడు 25 ఏళ్లు వచ్చాయి. నాకు నేను నచ్చేవిధంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను ఏదైతే చెప్తానో అదే చేయాలనుకుంటాను. నాకు నేనుగా నా ప్రామాణికంగా ఉండాలనుకుంటా. పబ్లిక్‌ లైఫ్‌, వ్యక్తిగత జీవితం మధ్య పెద్దగా తేడా చూపించడం నాకు నచ్చదు' అని ఎమ్మా వివరించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి