జర్మనీలో 90 స్క్రీన్లలో 'ఇంగ్లీష్ వింగ్లీష్' విడుదల!

27 Jun, 2013 20:52 IST|Sakshi
జర్మనీలో 90 స్క్రీన్లలో 'ఇంగ్లీష్ వింగ్లీష్' విడుదల!
భారత దేశంలోనే కాక విదేశాల్లో విమర్శకుల ప్రశంసలందుకున్న 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం జర్మనీలో సుమారు 90 స్క్రీన్లలో జూన్ 27 తేది గురువారం విడుదలైంది. గౌరీ షిండే దర్శకురాలిగా పరిచయం అవుతూ..బాలీవుడ్ లోకి శ్రీదేవి రీఎంట్రీ చేసిన ఈ చిత్రంలో 2012 లో విడుదలైంది. ఎరోస్ ఇంటర్నేషనల్ తో కలిసి ఆర్ బాల్కీ నిర్మించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రాన్ని తాజాగా జర్మనీ భాషలో డబ్ చేశారు.
 
వివిధ దేశాల్లో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం ప్రదర్శరించబడటం చాలా గర్వంగా అనిపిస్తోంది అని.. అయితే జర్మనీలో ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తోందో అనే ఆసక్తి మరింత పెరుగుతోంది అని గౌరీ షిండే అన్నారు. ఇంగ్లీష్ భాష రాని మధ్య తరగతి భారతీయ మహిళ తన సమస్యల్ని అమెరికాలో ఎలా అధిగమించింది అనేది ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో శ్రీదేవి నటన విమర్శకుల్ని సైతం మెప్పించింది. 
 
>