మంచివాడు

7 Jan, 2020 05:38 IST|Sakshi
మెహరీన్‌, కల్యాణ్‌ రామ్

కల్యాణ్‌ రామ్, మెహరీన్‌ జంటగా ‘శతమానం భవతి’ ఫేమ్‌ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ని పొందింది. సతీశ్‌ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతికి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో సాగే కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌ తోట, సంగీతం: గోపీ సుందర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా