ధృవ‌, అదితి ఆర్యల 'ఎప్పటికీ ప్రేమ'

13 Apr, 2017 16:05 IST|Sakshi

ధృవ‌, అదితి ఆర్య‌( ఇజం ఫేమ్‌) కాంబినేష‌న్‌లో రూపొందిన ఇండిపెండెంట్ ఆల్బమ్ సాంగ్ `ఎప్పటికీ ప్రేమ‌` ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. 300కు కైగా థియేట‌ర్ షోస్ చేసి అంత‌ర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ధృవ, ఈ ఇండిపెండెంట్ ఆల్బమ్ తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రొమాంటిక్ సాంగ్‌ను ప్రముఖ కొరియోగ్రాఫ‌ర్ స్వరూప్ రాజ్ మేడ‌ర డైరెక్ట్ చేశారు.

ఇటీవల రిలీజ్ అయిన సాంగ్ టీజర్కు మంచి రెస్పాన్స వచ్చింది. శైలేష్ సువ‌ర్ణ  సంగీతం అందించగా.. గ్రాండ్ విజువ‌ల్స్, హై క్వాలిటీ చాలా రిచ్గా పిక్చరైజ్ చేశారు.. మంచి లుక్‌, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ధృవ‌కు ఈ సాంగ్, టాలీవుడ్‌లో మంచి ఎంట్రీ అవుతుందని భావిస్తున్నారు. ఈ నెల 14 ఎప్పటికీ ప్రేమ సాంగ్‌ను ల‌హ‌రి మ్యూజిక్‌వారు విడుద‌ల చేస్తున్నారు.