రైలెక్కి చెక్కేస్తా...

18 Oct, 2019 02:32 IST|Sakshi
సురేష్‌ కొండేటి, బాబీ, సుమన్‌బాబు

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై బేబి ఢమరి సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్‌ సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. మదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిన హారర్‌ చిత్రం ఇది. ఈ చిత్రంలోని ‘రైలెక్కి చెక్కేస్తా...’ అనే ఐటెమ్‌ సాంగ్‌ను దర్శకుడు బాబీ, నటుడు సత్యప్రకాశ్‌ విడుదల చేశారు. ‘ఎర్రచీర’ చిత్రం రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను రామసత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ– ‘‘ఐటెమ్‌ సాంగ్‌ బావుంది. సుమన్‌ గారు దర్శకునిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు నిర్వర్తించటం చాలా గొప్ప విషయం.

సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. సుమన్‌ మాట్లాడుతూ– ‘‘ఎంతో బిజీ షెడ్యూల్‌లో కూడా దర్శకుడు బాబీ మా సినిమాను ఆశీర్వదించటానికి వచ్చారు. కొన్ని కారణాల వల్ల ఢమరి అనే సొంత మ్యూజిక్‌ కంపెనీని స్టార్ట్‌ చేశాను. శ్రీకాంత్‌గారు ఇంతకుముందు ఎప్పుడూ చేయని అఘోర పాత్రలో నటించారు. డిసెంబర్‌ 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇందులో మంచి పాత్ర చేశా’’ అన్నారు హీరోయిన్‌ సంజనా శెట్టి. సినిమాలో ఓ కీలక పాత్ర చేసిన సురేష్‌ కొండేటి, మాజీమంత్రి పుష్పలీల, సంగీత దర్శకుడు ప్రమోద్, రచయిత గోపి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు