చాలామంది గెటౌట్‌ అన్నారు

12 Mar, 2020 05:15 IST|Sakshi
కార్తీక్‌ ఆనంద్

‘‘కాలేజీ నేపథ్యంలో హ్యాపీడేస్‌ నుంచి ‘ప్రేమమ్‌’ వరకు చాలా సినిమాలొచ్చాయి. కాలేజ్‌లో జరిగే ఓ ఫెస్ట్‌ (ఫెస్టివల్‌) ఆధారంగా వస్తున్న సినిమా మా  ‘యురేక’’ అన్నారు కార్తీక్‌ ఆనంద్‌. సయ్యద్‌ సోహైల్‌ రియాన్, కార్తీక్‌ ఆనంద్, డింపుల్‌ హయతి, షాలిని, సమీక్ష ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘యురేక’. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ప్రశాంత్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. లలిత కుమారి సహనిర్మాత. కార్తీక్‌ ఆనంద్‌ మాట్లాడుతూ – ‘‘నాకు చిన్నప్పటి నుంచే సినిమాలు, కథలు రాయడం ఆసక్తి.

‘యురేక’లో నటించి, దర్శకత్వం వహించాను. ఓ కాలేజ్‌ ఫెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మర్డర్‌ మిస్టరీయే ఈ చిత్రం. సినిమాకు సెకండాఫ్‌ హార్ట్‌ లాంటింది. ఫస్టాఫ్‌ సరదాగా సాగుతుంది. సమకాలీన అంశాలకు సందేశాన్ని జోడించాం. సినిమా చాన్స్‌ కోసం స్క్రిప్ట్స్‌ పట్టుకుని చాలామంది ప్రొడ్యూసర్స్‌ని కలిశాను. నేనే యాక్ట్‌ చేసి, డైరెక్ట్‌ చేస్తానని చెప్పగానే చాలామంది గెటౌట్‌ అన్నారు. ప్రశాంత్‌గారు నన్ను నమ్మి ‘యురేక’కి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేస్తూ సెలవుల్లో ‘యురేక’ సినిమా తీశాను. ఈ సినిమా ఫలితాన్ని బట్టి నా కెరీర్‌ను నిర్ణయించుకుంటాను’’ అన్నారు. 

మరిన్ని వార్తలు