తెలుగు సినిమాకి మంచి కాలం

20 Jul, 2019 01:35 IST|Sakshi
అడివి శేష్, సమంత, వెంకట్, నవీన్‌ చంద్ర

– సమంత

‘‘ప్రస్తుతం తెలుగు సినిమాకు గ్రేట్‌ టైమ్‌. కాన్సెప్ట్‌ మూవీలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ ధైర్యం వచ్చింది. ఈ ధైర్యాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు అక్కినేని సమంత. అడివి శేష్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఎవరు’. ఈ చిత్రంలో రెజీనా కథానాయికగా నటించారు. నవీన్‌ చంద్ర కీలక పాత్రధారి. వెంకట్‌ రామ్‌జీ దర్శకత్వంలో పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నే నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేసిన సమంత మాట్లాడుతూ– ‘‘టీజర్‌ చాలా బాగా నచ్చింది. సినిమా మీద ఆసక్తి పెరిగింది. కొత్త కంటెంట్‌ సినిమాలతో ఇండస్ట్రీని అడివి శేష్‌ ముందుకు తీసుకెళ్తున్నాడు. అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించారు వెంకట్‌.

రెజీనా మంచి నటి. నవీన్‌చంద్రతో సహా టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు సమంత. ‘‘సమంతలోని పాజిటివ్‌ వైబ్స్‌ లక్‌గా మారతాయి. ‘గూఢచారి’ సమయంలో ఆమె సపోర్ట్‌ చేశారు. ‘క్షణం’ ముందు వరకు అందరూ నన్ను విలన్‌గా చూశారే తప్ప... మెయిన్‌ లీడ్‌గా ఎవరూ చూడలేదు. ఆ సమయంలో నన్ను నమ్మిన ఒకే ఒక వ్యక్తి పీవీపీగారు. ఆయనకు థ్యాంక్స్‌. నేను ఎప్పుడూ మంచి సినిమాలో భాగం కావాలనుకుంటాను. ఎందుకంటే మనం ఉండొచ్చు. లేకపోవచ్చు. కానీ మంచి సినిమా ఎప్పుడూ ఉంటుంది. ఈ నమ్మకంతోనే ఈ సినిమా తీశాం. వెంకట్‌ను ఈ సినిమాను మనసు పెట్టి చేయమన్నాను’’ అన్నారు అడివి శేష్‌. ‘‘మంచి పాత్ర చేశాను’’ అన్నారు నవీన్‌చంద్ర.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు