సంక్రాంతి సోగ్గాడు

13 Jan, 2016 22:14 IST|Sakshi
సంక్రాంతి సోగ్గాడు

నాన్న గారి హిట్ పాట... సెంటిమెంట్ పంచె... వాచీ... రమ్యకృష్ణ హిట్ కాంబినేషన్... గ్రామీణ నేపథ్యం... అన్నీ కలసి అక్కినేని నాగార్జున ఈ 15న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనిపించుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో ‘సాక్షి’ ముఖాముఖి
 
 ఇప్పుడు ఈ ‘సోగ్గాడి’ వేషం వేయాలనెందుకు అనిపించింది?
 తెరపై గ్రామీణ నేపథ్యపు సినిమాలు వచ్చి చాలా రోజులైపోయింది. ఎక్కువగా పట్టణ ప్రాంత కథలే వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ‘మనం’ సినిమాలో గ్రామీణ నేపథ్యంలో నా మీద నడిచే ఎపిసోడ్ వచ్చింది. అయితే, అక్కడ పాత్రధారుల మధ్య అనుబంధాల లాంటివి ఏమీ చూపించలేదు. గ్రామీణ నేపథ్యంలో అవన్నీ చూపిస్తూ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీయాలనే ఆలోచన చేశాం. అలా ‘మనం’ నుంచి ఈ సినిమా ఐడియా పుట్టింది. పైగా, గతంలో నేను చేసిన గ్రామీణ నేపథ్య చిత్రాలు ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’, ‘అల్లరి అల్లుడు’ బాగా హిట్టయ్యాయి.
 
 ఈ ప్రయోగాన్ని కొత్తవాడైన కళ్యాణ్‌కృష్ణ చేతికిచ్చారేం?
 ఇలాంటి సినిమా ఒకటి చేయాలనుకుంటున్న టైమ్‌లోనే నిర్మాత పి. రామ్మోహన్ నాకో కథ చెప్పారు. నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. ఈ కథను మామూలు బ్యాక్‌డ్రాప్‌లో కూడా చేయవచ్చు. అలాకాక, గ్రామీణ నేపథ్యంగా మార్చి చెబితే అని ఆలోచించాం. అప్పుడు మిత్రుల ద్వారా కళ్యాణ్ కృష్ణ  నేటివిటీ తెలిసిన మంచి రైటర్ అని తెలిసింది. అతనికి కథ ఇస్తే, నెలరోజుల్లో స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసుకొచ్చాడు. తెలివైన, చురుకైన అతనికే  దర్శకత్వం చాన్‌‌స ఇచ్చి, మంచి టీవ్‌ును సమ కూరిస్తే సినిమా చేయిం చుకోవచ్చనుకున్నాం.
 
  నాన్నగారి హిట్ పాట టైటిల్ పెట్టారే...
 ‘సోగ్గాడు’ అని పెడ దామనుకున్నాం. తండ్రి, కొడుకు - రెండు పాత్రలు న్నాయని ఈ టైటిల్ పెట్టాం.  
 
  సంక్రాంతి పోటాపోటీలో ఇప్పుడు రిలీజ్ ప్లాన్ చేశారేం?
 నిజానికి గత జనవరిలో షూట్ మొదలైంది. దసరాకు రిలీజనుకున్నాం. ఇంతలో అఖిల్ సినిమా వస్తోందని వాయిదా వేసి, సంక్రాంతికి ప్లాన్ చేశాం.
 
 మీరెప్పుడూ క్రిస్మస్ ముందు డిసెంబర్‌లో రిలీజ్ చేస్తారుగా!
 ఇది డిసెంబర్‌కు రావాల్సిన సినిమా కాదు. పండగ సీజన్‌లో రావాల్సిన ఫెస్టివల్ మూడ్ ఫిల్మ్. ఆ మాటకొస్తే, అంతా డిసెంబర్ రిలీజంటే బ్యాడ్ సీజన్ అనుకొనే రోజుల్లోనే, క్రిస్మస్ ముందు ‘మన్మథుడు’ రిలీజ్ చేశా. ఆ సంక్రాంతికి 3 సినిమాలుండడంతో, క్రిస్మస్ సెలవుల్లో సోలోగా రావచ్చని అలా చేశా. హిట్ వచ్చింది. తర్వాత ‘మాస్’కు అదే చేశా. డిసెంబర్‌లో సినిమాల రిలీజ్ ట్రెండ్ నేను సెట్ చేసిందే.
 
 ద్విపాత్రాభినయం, ఒక పాత్ర ఆత్మ అని ముందే చెప్పాశారే!
 హాలీవుడ్‌లోలా ట్రైలర్‌లోనే కథ నేపథ్యం చెప్పి, జనాన్ని సిద్ధం చేయడాన్ని నేను ఇష్టపడతా. నమ్ముతా. అలా ట్రైలర్ చూసుకొనే, నేను సినిమాలకెళతా. అందుకే, ‘రాజన్న’కీ ముందే కథ చెప్పేశా. నేపథ్యం చెప్పినా ట్విస్టులు చెప్పం కాబట్టి ఏం ఫరవాలేదు. ‘సోగ్గాడే...’కి కూడా రెండో ట్రైలర్‌లోనే చాలామంది గర్‌‌లఫ్రెండ్‌‌స ఉన్న తండ్రి బంగా ర్రాజు పాత్ర ఆత్మ అనీ, అమెరికా నుంచొచ్చిన డాక్టర్‌గా కొడుకు రామ్ పాత్ర వట్టి అమాయకుడనీ చెప్పేశాం.
 
 ఆత్మంటున్నారు. మీరు కూడా హార్రర్ కామెడీ, థ్రిల్లర్ల బాటలో..
 లేదు లేదు. నాకు హార్రర్ సినిమాలిష్టం లేదు. వర్మ అప్పట్లో ‘శివ’ బదులు ‘రాత్’ తీద్దామంటేనే వద్దన్నా. సోగ్గాడే..లో బంగార్రాజు ఆత్మ భయపెట్టదు. కవ్వించి, నవ్విస్తుంది. ఇది చూశాక పిల్లలు బంగార్రాజు ఆత్మ లాంటి ఫ్రెండ్ ఉండాలనుకుంటారు. ఇక, ఫ్యామిలీలు మెచ్చే రొమాన్‌‌స ఉంది. పాము, గుడి లాంటి ఫ్యాంటసీ అంశాలున్నాయి.
 
 సినిమా అర్థమవుతుందా? లేక క్లిష్టమైన స్క్రీన్‌ప్లేతో ఏమైనా..!
 అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. ఆ మాటకొస్తే, ‘మనం’ కథ విన్నప్పుడు చాలామంది క్లిష్టమైన స్క్రీన్‌ప్లే అన్నారు. కానీ, జనానికి అర్థమైంది, నచ్చిందిగా. తాపీగా పాప్ కార్‌‌న తింటూ పక్కకు తిరిగినా, మళ్ళీ తెరపై చూస్తే కథ అర్థమవ్వాలని నేను భావిస్తా. ఇది అలానే ఉంటుంది.
 
 సినిమాకు రీషూట్స్ కూడా చేశారని వార్తలు వచ్చాయి!
 నేనెక్కువ టీమ్ వర్‌‌కను నమ్ముతా. మరీ ముఖ్యంగా, కొత్త డెరైక్టర్‌కి టీవ్‌ువర్‌‌క అవసరం. నిర్మాతగా నేనెప్పుడూ కథ ఫైనలైజ్ చేశాక టీమ్ లోని ఆ యా శాఖల హెడ్‌‌సతో కలసి కూర్చొని, చర్చిస్తాం. సినిమా తీసి ఎడిటింగ్ పూర్తయ్యాక చూసి, మళ్ళీ చర్చిస్తాం. దీనివల్ల లాజిక్‌లలో తేడాలు, లోటుపాట్లు సరిచేసుకోవచ్చు. ఈ సినిమాకీ అంతే. సెప్టెంబర్‌లో షూటింగైపోయాక, కొత్త రైటర్‌‌సని కూడా కన్సల్ట్ చేసి, 5-6 రోజులు రిపేర్లు, రీషూట్లు చేశాం. అలా చేయడం ఈజీ. అంతేకాక, దానివల్ల తుది ప్రొడక్ట్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. అదే చేశాం. ఏమైనా ఈ చిత్ర స్క్రీన్‌ప్లే, డెరైక్షన్‌కి మెయిన్ కళ్యాణ్‌కృష్ణ. 80 శాతం అతనిదే. మిగిలినది టీమ్ వర్‌‌క. కథలో ఏ పాయింట్, ఎక్కడ బయటపెడుతూ, ఆసక్తిగా కథను నడపాలో సత్యానంద్ గారి లాంటి సీనియర్ గైడ్ చేశారు. నవంబర్ నుంచి డి.ఐ, ఆర్‌ఆర్ లాంటి ముస్తాబులు చేశాం. డిసెంబర్ 31న అందరం ఫస్ట్ కాపీ చూసేశాం. అదే యథాతథంగా సెన్సార్‌కీ పంపిన కాపీ.
 
 కానీ, మీ గత సోషియో ఫ్యాంటసీ ‘ఢమరుకం’ రిజల్ట్...
 (మధ్యలోనే) నా కెరీర్‌లో ‘మనం’ తర్వాత అత్యధికంగా కలెక్ట్ చేసిన సినిమా అంటే అదే. రూ. 30 కోట్లొచ్చింది. సరిగ్గా రిలీజ్ ప్లాన్ చేయకపోవడం దానికి దెబ్బయింది.
 
 ఈ సినిమాకు మీరు ఏయన్నార్‌గారి పంచె, వాచీ వాడారట.
 అవును. ఏయన్నార్ పంచెలని నాన్న గారి పంచెలు ఫేమస్. నేను, నాగచైతన్య, అఖిల్ ముగ్గురం కలసి పంచెకట్టులో టీవీ చానల్‌లో ప్రమోషన్ కోసం కనిపించాం. ఇక, ఈ చిత్రంలో రమ్యకృష్ణ, అనసూయ, హంసానందిని ఇలా చాలామంది గర్‌‌లఫ్రెండ్‌‌స ఉన్నా, ‘కృష్ణకుమారి’ అనే మరో గర్‌‌లఫ్రెండ్ పాత్ర కూడా ఉంది. అదెవరన్నది సస్పెన్‌‌స.
 
 మొత్తానికి రొటీన్ సినిమాలకు భిన్నంగా రూట్ మార్చారు.
 అవును. ‘భాయ్’ తర్వాత ఇక రొటీన్ సినిమాలు చేయరాదనీ, చేసినా జనం చూడరనీ అర్థమైంది. 32 ఏళ్ళుగా చేస్తున్నా. కొత్తరకం సినిమాలు చేయాల్సిన ఏజ్, టైమ్ వచ్చేసింది.
 
 మీ తదుపరి చిత్రం ‘ఊపిరి’ ఆ వరసలోదేనా?
 అది ఫ్రెంచ్ సినిమా ‘ఇన్‌టచబుల్స్’కి రీమేక్. నేను వీల్‌ఛైర్‌కే పరిమితమైన పాత్ర చేస్తున్నా. పూర్తి ఎంటర్‌టైన్ మెంట్. నేను, కార్తీ నటిస్తున్నాం. ముందుగా చిన్న ఎన్టీయార్ అనుకున్నా, ‘నాన్నకు ప్రేమతో’ డేట్స్‌క్లాష్‌తో కుదర్లేదు.
 
 మీరూ, బాలకృష్ణ కలసి మల్టీస్టారర్ చేసే ప్లాన్ ఏమైంది?
 అనుకున్నాం కానీ, కుదర్లేదు. దర్శక, నిర్మాతలెవరన్నా వస్తే చేయడానికి రెడీనే. నేను నటిస్తూ, రీమేక్ చేయాలన్నా- నాన్న సినిమాల్లో కూడా ‘డాక్టర్ చక్రవర్తి’ లాంటి మంచి సినిమాలున్నాయి. కానీ, వాటిని చేసే డెరైక్టర్‌‌స కావాలి.
 
  ‘శివ’ చిత్రం డిజిటలైజ్ చేశారన్నారు. రిలీజెప్పుడు?
 రీరిలీజ్ చేద్దామంటే, గ్యాప్ లేకుండా రిలీజ్‌లొస్తున్నాయి.
 
 కొన్నినెలలుగా ప్రతివారం ఇన్నేసి ఫిల్మ్స్ రావడం ఇబ్బందేగా!
 ఇబ్బందే. ఇన్ని రిలీజైతే, బాగున్నా ఇన్ని సినిమాలు జనం చూడలేరు. కాబట్టి, ఎగ్జిబిటర్‌‌సలో ప్లానింగ్ ఉండాలి. కానీ, సంక్రాంతి లాంటి పండగలకు ఒకేసారి చాలా సినిమాలు వస్తాయి. ప్రతిసారీ అంతే. వచ్చేసారీ అంతే.
 
  ఈసారి నందమూరి, అక్కినేని వంశాల పోటీ అని టాక్?
 అటువంటిదేమీ లేదు. అయినా, నన్ను వివాదాల్లోకి లాగకండి బాబూ. 32 ఏళ్ళుగా చేస్తున్నా. మంచి సినిమాలు నటించడం, నిర్మించడమే తప్ప, నేను అవుట్ ఆఫ్ ది రేస్.
 
  నాన్న గారు పోయి రెండేళ్ళవుతోంది. స్మారకచిహ్నాలేమైనా?
 విగ్రహాలు పెట్టడం లాంటివి నాన్న గారు, మేమూ నమ్మం. జనవరిలో కాదు కానీ, ఏటా నాన్న గారి పేరిట జాతీయ అవార్డులివ్వడం కొనసాగిస్తాం. అలాగే, చాలా ప్లాన్‌‌స ఉన్నాయి. అవన్నీ త్రీడీ ప్రెజెంటేషన్ చేసి మరీ చెబుతా.
 
  ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో మీకు ఆత్మతృప్తి నిస్తోందా?
 బాధల్లో ఉన్నవారి నుంచి విజేతల దాకా అందరి మాటలూ పంచుకొనే వేదికగా తృప్తి ఉంది. మార్చి దాకా ఆ షో షూటింగ్‌తో బిజీ.
 
 ‘అఖిల్’ సినిమా రిజల్ట్ ఎక్కడ తేడా వచ్చింది? నిరాశపడ్డారా?
 కచ్చితంగా నిరాశపడ్డాం. కానీ దర్శకుడు వినాయక్, నిర్మాతల లోపమేమీ లేదు. కొత్తతరం హీరో మళ్ళీ అవే డ్యాన్‌‌సలు, ఫైట్స్ చేస్తే చూడరనీ, కొత్త ఆలోచనలు, కథలతో వెళ్ళాలనీ విలువైన పాఠం అఖిల్ తొలి సినిమాకే నేర్చుకున్నాడు. నేను 8 సినిమాల తర్వాత గ్రహించి, మణిరత్నం గారిని పట్టుకొని ‘గీతాంజలి’ చేశా. అది, ‘శివ’ తరువాతే నన్ను జనం స్టార్‌గా అంగీకరించారు.
 
   అఖిల్ తరువాతి సినిమా ‘యే జవానీ హై దివానీ’ అట?
 అది అఖిల్ ఫస్ట్ సినిమాకు 6 నెలల ముందనుకొన్న మాట. అఖిల్‌కు అలాంటి సినిమా ఛాయలైతే బాగుం టుందని కొందరు దర్శకులతో ప్రస్తావించా. అంతే తప్ప ఆ ఫిల్మ్ చేయాలని కాదు. ఆ వార్త ఇప్పుడు బయటకొచ్చింది.
 
 ఇంట్లో మీరు, అమల, నాగచైతన్య. అఖిల్ అందరూ ఇప్పుడు నటనతో బిజీ అయిపోయారు? మాట్లాడే టైం దొరకుతోందా?
 హాయిగా కబుర్లు చెప్పుకుంటాం. చాలామంది రాత్రి భోజనం దగ్గరే... కబుర్లతో సరిపెడతారు. అది సరైనది కాదు. అక్కడ తిండి ఎంజాయ్ చేయాలి. మా ఫ్యామిలీ మెంబర్‌‌స రోజూ కనీసం 2-3  గంటలు మాట్లాడుకుంటాం.
 
 పైరసీపై చర్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి విజ్ఞప్తి చేశారు?
 అవును. ఇక్కడ పైరసీ చేస్తే 500 జరిమానాతో సరిపెట్టేస్తారు. కానీ, తమిళనాట నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్, మూడు నెలల జైలు. అందుకే అక్కడ తమిళ సినిమాలు పైరసీ కావు. అలాంటి జీవో ఇక్కడా తేవాలి.  
 
 కేటీఆర్ మీకు క్లోజ్... మీకు ఫ్యాన్ అట?
 రామ్(కేటీఆర్) నాకు పదేళ్ళుగా తెలుసు. మంచి ఫ్రెండ్.
 
   స్టూడియోను రిలయన్స్‌తో కలిసి విస్తరిస్తున్నారని అప్పట్లో...?

 (అందుకుంటూ...) అవన్నీ తప్పుడు వార్తలే. కాకపోతే, చాలా ప్లాన్‌‌స ఉన్నాయి. అందులో తొలి అడుగు ‘అన్నపూర్ణా ఏడెకరా’ల్లో కట్టిన ఫ్లోర్లు, పెట్టిన వసతులు. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్లు కూడా మాకిలాంటి స్టూడియోలు లేవే అని బాధపడుతున్నారు, మన తెలుగు పరిశ్రమకిది వర ం.
 
  అన్నపూర్ణా ఫిల్మ్ స్కూల్ ఎలా నడుస్తోంది?
 అద్భుతంగా రన్ అవుతోంది. బిజినెస్ గురించి చదివే వాళ్లకి ఐఎస్‌బీ లాగా, సినీపరిశ్రమకు ఈ స్కూల్ అవుతుంది.
 - రెంటాల జయదేవ