అర్జున్ రెడ్డి.. ఇంకాస్త పెరిగింది..!

3 Sep, 2017 11:18 IST|Sakshi
అర్జున్ రెడ్డి.. ఇంకాస్త పెరిగింది..!

వివాదాస్పద చిత్రంగా టాలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో ఏ సినిమా లేనంతా నిడివితో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమాకు మరో పది నిమిషాల సీన్స్ ను యాడ్ చేశారు.  మూడు గంటల ఒక నిమిషం నిడివితో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక పై మూడు గంటల పదకొండు నిమిషాల నిడివితో ప్రదర్శించనున్నారు. ఈ సీన్స్ ను సెకండ్ హాఫ్ లో యాడ్ చేయనున్నారట.

సోమవారం నుంచి థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతుండటంతో అదే రోజు ఈ సన్నివేశాలను యాడ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి.. కొత్త సీన్స్ యాడ్ చేసిన తరువాత మరోసారి సత్తా చాటుతుందని భావిస్తున్నారు మేకర్స్. అయితే సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిసిస్తున్నా... వివాదాలు మాత్రం సద్దుమణగటం లేదు.