ఫన్‌ చేస్తారా?

12 Apr, 2019 03:46 IST|Sakshi
వెంకటేశ్, అర్జున్‌ కపూర్‌

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రం ‘ఎఫ్‌ 2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌ తేజ్, తమన్నా, మెహరీన్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు నిర్మించారు. ఈ సినిమాను బోనీకపూర్‌తో కలిసి ‘దిల్‌’ రాజు హిందీలో రీమేక్‌ చేయనున్నారు. హిందీ చిత్రంలో వెంకటేశ్, అర్జున్‌ కపూర్‌ హీరోలుగా నటించబోతున్నారని బాలీవుడ్‌ టాక్‌. తెలుగు చిత్రాలు ‘పెళ్లాం ఊరెళితే, రెడీ’లను నో ఎంట్రీ, రెడీగా హిందీలో రీమేక్‌ చేసిన అనీస్‌ బాజ్మీ హిందీ ‘ఎఫ్‌ 2’ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇక బోనీకపూర్‌ తనయుడే అర్జున్‌ కపూర్‌ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి.. వెంకీ, అర్జున్‌ కాంబినేషన్‌ నిజమేనా? వేచి చూద్దాం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు