మణిరత్నంకు షాక్‌ ఇచ్చిన హీరో

8 Feb, 2018 12:01 IST|Sakshi
నటుడు ఫహాద్‌ ఫాజిల్‌, దర్శకుడు మణిరత్నం

దక్షిణాది లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీ స్టారర్‌ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. శింబు, విజయ్‌ సేతుపతి, అరవింద్‌ స్వామి, జ్యోతిక లాంటి భారీ స్టార్‌ కాస్ట్‌ తో ఓ సినిమాను ప్లాన్ చేశారు మణి. అయితే చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఇంత వరకు సెట్స్‌ మీదకు వెళ్లలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి కోలీవుడ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోంది.

మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్‌తో సినిమా అంటే ఏ హీరో అయినా కాదనడూ.. కానీ మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్ మాత్రం మణి సినిమాలో నటించేందుకు ముందు అంగీకరించి తరువాత నో చెప్పేశాడట. సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఫహాద్‌ తప్పుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు