అది అబద్ధం

25 Jul, 2018 00:21 IST|Sakshi

అదిగో వాళ్లు నటిస్తున్నారు అంటే కాదు ఇదిగో వీళ్లు ఎంపిక అయ్యారంటూ ఇండస్ట్రీలో చాలా మంది జోస్యం చెబుతున్నారు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించి. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్‌ మూవీ గురించి మంగళవారం ఓ వార్త షికారు చేసింది. అయితే ఈ సినిమాలో కథానాయికగా నటించే చాన్స్‌ను సమంత తిరస్కరించారన్నది ఆ వార్త. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదని తెలిసింది.

ఈ విషయం గురించి ‘సాక్షి’ సమంతను అడగ్గా– ‘‘ఇప్పటివరకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సభ్యులెవరూ నన్ను సంప్రదించలేదు. అలాంటప్పుడు నేనెలా తిరస్కరిస్తాను. రిజెక్ట్‌ చేశానన్న వార్త పూర్తిగా అవాస్తవం’’ అని అన్నారు. ‘రంగస్థలం, మహానటి, అభిమన్యుడు’ చిత్రాలతో ఆల్రెడీ ఈ ఏడాది సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేశారు సమంత. ఆమె నటించిన ‘సీమరాజా, యు–టర్న్, సూపర్‌ డీలక్స్‌’ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ‘సీమరాజా, యు టర్న్‌’ సినిమాలు సెప్టెంబర్‌ 13నే రిలీజ్‌ కానుండటం విశేషం.
 

మరిన్ని వార్తలు