స్టిల్‌ లోడింగ్‌..!

14 Mar, 2018 00:50 IST|Sakshi

‘ఇంకా మిగిలే ఉంది బాసూ..’ ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ గురించి ఆయన ట్రైనర్‌ స్టీవెన్‌ లాయిడ్స్‌ చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఈ మిగిలిన దాన్ని కూడా మిగల్చకుండా కంప్లీట్‌ చేసే పనిలో పడ్డారు ఎన్టీఆర్‌ అండ్‌ స్టీవెన్స్‌. అందులో భాగంగానే ఎన్టీఆర్‌ సీరియస్‌గా వర్కౌట్స్‌ చేస్తున్న ఫొటోను ‘‘థింగ్స్‌ ఆర్‌ గెటింగ్‌ సీరియస్‌.. కొత్త లుక్‌ కోసం ఎన్టీఆర్‌ ఇలా కష్టపడుతున్నాడు’ అన్న క్యాప్షన్‌ ఉండేలా స్టీవెన్‌ లాయిడ్‌ ఎన్టీఆర్‌ ఫొటోను పోస్ట్‌ చేశారు. అంటే.. ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ స్టిల్‌ లోడింగ్‌ అన్నమాట.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక కథానాయికగా పూజాహెగ్డేను ఎంపిక చేశారు. ఈ సినిమాకు ‘ఆన్‌ సైలెంట్‌మోడ్‌’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని టాక్‌. ఈ చిత్రంలో స్లిమ్‌ అండ్‌ స్టైలిష్‌ లుక్‌తో పాటు సిక్స్‌ప్యాక్‌లో కనిపించనున్నారట ఎన్టీఆర్‌. ఏప్రిల్‌లో షూటింగ్‌ను స్టార్ట్‌ చేయనున్న ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త. కెమెరా: పీయస్‌ వినోద్‌. 

మరిన్ని వార్తలు