అకీరా గురించి రేణు దేశాయ్ టెన్షన్..

23 Aug, 2016 17:49 IST|Sakshi
అకీరా గురించి రేణు దేశాయ్ టెన్షన్..

పవర్స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్.. తల్లి రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇష్క్ వాలా లవ్'లో ఓ చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం మరాఠీలో రూపొందించిన ఈ సినిమాను ప్రస్తుతం తెలుగులో డబ్ చేశారు. త్వరలో ఈ చిత్రాన్ని టెలివిజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 'ఇష్క్ వాలా లవ్'తో అకీరా మినీ స్క్రీన్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు.

అకీరాను పవన్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని రేణు ఆందోళన పడుతోంది. 'అకీరా తొలి పరిచయం గురించి ఓ చిన్నమాట..  ఈ సినిమాలో నటించినప్పుడు మా అకీరాకి 9ఏళ్లు. ఈ చిన్న డెబ్యూ రోల్కి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దని నా విన్నపం' అంటూ అభిమానులను ఉద్దేశించి ట్విట్టర్లో ఇటీవలే ఓ చిన్న నోట్ పోస్ట్ చేసింది రేణు. కాగా మరాఠీలో తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్న అకీరా.. ఇప్పుడు తెలుగులో కూడా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నాడట. అదే సంబరంగా చెప్పుకుంటుంది రేణు. తనయుడిని డైరెక్ట్ చేయడం అనేది తల్లిగా తనకు సెంటిమెంటల్ మొమెంట్ అంటోంది.