కరీనాకేమయ్యింది...

27 Mar, 2018 12:46 IST|Sakshi

న్యూ ఢిల్లీ : కరీనా కపూర్‌కు ఏమైంది, అసలు ఆమె ఆహారం తీసుకుంటుందా లేదా? ఎందుకిలా అస్థిపంజరంలా మారిపోయింది...మళ్లీ ఏదైనా సర్జరీ చేయించుకుందా, లేదా మళ్లీ సైజ్‌ జీరో కోసం ప్రయత్నిస్తుందా...అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విషయమేంటంటే కరీనా కపూర్‌ అప్పుడప్పుడు ర్యాంప్‌ వాక్‌ చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమె ర్యాంప్‌ వాక్‌చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. 2016 డిసెంబర్‌లో తైమూర్‌ పుట్టిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆమె ర్యాంప్‌ వాక్‌ చేశారు.

తన అభిమాన డిజైనర్‌ మనిష్‌ మల్హోత్రా కోసం తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అమృత అరోరాతో  కలిసి సింగపూర్‌లో నిర్వహించిన ఒక ఫ్యాషన్‌ షోలో ర్యాంప్‌ వాక్‌ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను అమృత అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.ఈ ఫోటోల్లో కరీనా మరీ పీలగా.. చిక్కిపోయినట్లు ఉన్నారు. ఈ ఫోటోలు చూసి నిరుత్సాహపడిన అభిమానులు కరీనాకు ఏమైంది అస్థిపంజరంలా తయారయ్యింది, మళ్లీ సైజ్‌ జీరో కోసం ప్రయత్నిస్తుందా, ఏదైనా సర్జరీ చేయించుకుందా అంటూ రకరకాల కామెంట్లు చేశారు. కొందరు కరీనా తన వయసు కంటే పెద్దదిగా కన్పిస్తుందని అమృత అరోరానే అందంగా ఉందని కామెంట్‌ చేశారు.

తల్లి అయ్యాక కరీన తన బరువును తగ్గించుకోవడానికి చాలా శ్రమపడ్డారు. అందుకు సంబంధించి ఆమె జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలను తన అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం కరీనా శశాంక్‌ ఘోష్‌ ‘వీర్‌ ది వెడ్డింగ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో కరీనాతో పాటు సోనమ్‌ కపూర్‌, స్వర భాస్కర్‌ లు కీలక ప్రధాన పాత్రల్లో  నటిస్తున్నారు

మరిన్ని వార్తలు