ఫాంటసీ ప్రేమకథా చిత్రమ్‌

6 Sep, 2017 00:20 IST|Sakshi
ఫాంటసీ ప్రేమకథా చిత్రమ్‌

కార్తీక్‌రాజు, మిస్తీ చక్రవర్తి జంటగా ఎం. పూర్ణానంద్‌ దర్శకత్వంలో వింగ్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ప్రతిమ. జి నిర్మిస్తున్న సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకులు కరుణాకరన్‌ క్లాప్‌ ఇవ్వగా, దశరథ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. క్రాంతిమాధవ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఇదొక ఫాంటసీ ప్రేమకథా చిత్రమ్‌. ఫ్రెష్‌లుక్‌తో ఉంటుంది. ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలు పెడుతున్నాం.

కీలక పాత్రలో సీనియర్‌ ఎన్టీఆర్‌ కనిపిస్తారు. గ్రాఫిక్స్‌ ద్వారా ఆయన్ను క్రియేట్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరోగా నా మూడో చిత్రమిది. త్వరలో ‘క్రియేటివ్‌ కమర్షియల్స్‌’ కేఎస్‌ రామారావుగారితో ఓ సినిమా చేయబోతున్నా’’ అన్నారు కార్తీక్‌రాజు. నిర్మాతలు కేఎస్‌ రామారావు, ‘వైజాగ్‌’ రాజు పాల్గొన్నారు.