‘హ్యాపీ బర్త్‌డే మమ్మీ.. లవ్‌ యూ ఎవర్‌’

10 Jan, 2020 11:32 IST|Sakshi

ముంబై : బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్, ప్రొడ్యూసర్‌ ఫరా ఖాన్ గురువారం తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ రోజుతో ఆమె 55వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. దీంతో బాలీవుడ్‌ ప్రముఖుల నుంచి ఫరాఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ మాధురి దీక్షిత్‌.. ఫరాతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ‘మనం కలిసినప్పుడల్లా నవ్వుతూనే ఉంటాం. ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు. యే జవానీ హై దివానీ సినిమాలో వీరిద్దరూ కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఫరా కొరియాగ్రాఫిలో మాధురీ, రణ్‌బీర్‌ కపూర్‌ కలిసి ఘాగ్రాకు పాటకు స్టెప్పులేశారు.

మరోవైపు ఫరాఖాన్‌ను ప్రేమగా అమ్మ అని పిలుస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే మమ్మీ.. లవ్‌ యూ ఎవర్‌’ అంటూ కత్రినా కైఫ్‌ విష్‌ చేశారు. బాలీవుడ్‌ నడుటు అనిల్‌ కపూర్‌ సైతం ఫరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నా, పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని తెలిపారు. వీరితోపాటు రవీనా టండన్‌, అనన్య పాండే, కార్తిక్‌ ఆర్యన్‌ తదితరులు ఫరాకు బర్తడ్‌ విషేస్‌ తెలిపారు. ఇక దాదాపు వంద పాటలకు పైగా కొరియోగ్రఫి చేసిన ఫరా.. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఆరు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు.

Love you faru @farahkhankunder to the moon and back! Happpyyyy Birthdayyy ! The karmic connection continues.. 😜😜andar bahar, bahar andar 😂😂😂😂😂😂😘😘😍

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా