క‌రోనా: జ‌ంతువుల కోసం కుంచె ప‌ట్టి..

13 Apr, 2020 10:07 IST|Sakshi

లాక్‌డౌన్ వ‌ల్ల పేద ప్ర‌జ‌లకు పూట గ‌డ‌వ‌డం క‌ష్ట‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఎంతోమంది పెద్ద మ‌న‌సుతో ముందుకు వ‌చ్చి వారికి నిత్యావ‌స‌ర స‌రుకులు అందిస్తూ, నిర్భాగ్యుల‌కు భోజ‌నం పెడుతున్నారు. సినీ సెల‌బ్రిటీలు కూడా త‌మ‌కు తోచిన విధంగా సాయం చేస్తూ క‌ష్ట‌కాలంలో మీకు అండ‌గా మేమున్నామంటూ భ‌రోసా ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ఫ‌రాఖాన్‌ ప‌న్నెండేళ్ల కూతురు అన్యా జంతువుల కోసం ఆలోచించింది. వాటికి భోజ‌నం ఎలా దొరుకుతుంద‌ని త‌న‌లో తానే మ‌ధ‌న‌ప‌డింది. మండుటెండ‌లో తిండీ, నీళ్లు దొర‌క్క అవి చ‌నిపోకూడ‌ద‌ని నిశ్చ‌యించుకుంది. అందుకోసం మూగ‌జీవాల చిత్రాల‌ను గీసి వాటిని అమ్మకానికి పెట్టింది. ఒక్కో చిత్రాన్ని రూ.1000 చొప్పున అమ్మింది. అలా ఇప్ప‌టివ‌ర‌కు రూ.70 వేల వ‌ర‌కు విరాళాల‌ను సేక‌రించింది. (కరోనా కుయ్యో మొర్రో)

ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ ఫ‌రాఖాన్ ట్విట‌ర్‌లో స్వ‌యంగా వెల్ల‌డించారు. త‌న కూతురు అన్య డ్రాయింగ్ ద్వారా ఐదురోజుల్లో 70 వేల రూపాయ‌ల‌ను సేక‌రించింద‌ని తెలిపింది. వీటిని వీధి జంతువుల‌కు ఆహారాన్నందించేందుకు వినియోగించ‌నున్నట్లు పేర్కొంది. పెంపుడు జంతువుల చిత్రాల‌ను గీయ‌మ‌ని ఆర్డ‌ర్లు ఇచ్చిన‌వారితోపా‌టు, విరాళాలిచ్చిన‌వారికి క‌త‌జ్ఞ‌త‌లు తెలిపింది. కాగా చిన్నాపెద్ద‌, సామాన్యుడు సెల‌బ్రిటీ తేడా లేకుండా అంద‌రూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నేను సైతం అంటూ ఆర్థిక స‌హాయం అందిస్తున్న విష‌యం తెలిసిందే. (‘హ్యాపీ బర్త్‌డే మమ్మీ.. లవ్‌ యూ ఎవర్‌’)

మరిన్ని వార్తలు