#మీటూ : స్పందించిన సాజిద్‌ సోదరి

13 Oct, 2018 08:52 IST|Sakshi

మీటూ ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతున్న నేపథ్యంలో..బాలీవుడ్‌ నటి సలోని చోప్రా డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నటులు డ్రెస్‌ మార్చుకునే గదుల్లోకి వచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడని, వారి డ్రెస్‌ తీసి చూపించమని అడిగేవాడని, వాటిని తను అడ్డుకోబేతే బయటకు పంపేవాడని పేర్కొంది. తనను లైంగికంగా వాడుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. సినిమాలో అవకాశం కావాలంటే తనతో గడపాలన్నాడని, చాలా మంది మహిళలను ఇలానే వాడుకున్నాడని తెలిపింది. సమయం వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు బయటపెడుతున్నట్లు సలోని ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సాజిద్ సోదరి ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్ స్పందించారు. ‘ఇది మా కుటుంబానికి ఎంతో బాధాకరమైన సమయం. కొన్ని క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి మేం కృషి చేయాలి. ఒకవేళ నా సోదరుడు ఓ మహిళ పట్ల అలా ప్రవర్తించి ఉంటే..అతడు తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మహిళలను ఎవరైనా కించపరిచినా.. ఇబ్బందిపెట్టేటట్లు ప్రవర్తించినా..మేము బాధిత మహిళకు మద్దతుగా ఉంటాం. ఇలాంటివి సహించమ’ని ఫరా ఖాన్‌ ట్వీట్ చేశారు.

సలోలి చోప్రా ఆరోపణల నేపథ్యంలో సాజిద్ ఖాన్ దర్శకత్వంలో చేస్తున్నహౌస్ ఫుల్ 4 చిత్రాన్ని ఆపేస్తున్నట్లు అక్షయ్‌ కుమార్‌ ప్రకటించాడు. సాజీద్‌ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ పూర్తైన తరువాత షూటింగ్‌ మొదలు పెడుదామని ట్వీట్‌ చేశాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు