నాలుగు నగరాల్లో ఫర్హాన్ అక్తర్ మినీ మారథాన్!

9 Jul, 2013 01:52 IST|Sakshi
నాలుగు నగరాల్లో ఫర్హాన్ అక్తర్ మినీ మారథాన్!

'ఫ్లయింగ్ సిక్కు' మిల్కా సింగ్ జీవిత నేపథ్యంగా తెరకెక్కుతున్న 'భాగ్ మిల్కా భాగ్' చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆ చిత్ర హీరో ఫరాన్ అక్తర్ నాలుగు నగరాల్లో మినీ మారథాన్ నిర్వహించనున్నారు. మినీ మరథాన్ కార్యక్రమంలో అభిమానులతోపాటు ఫరాన్ అక్తర్ పరుగెత్తనున్నాడు.

ఢిల్లీ, చండీఘర్, అహ్మదాబాద్, జైపూర్ నగరాల్లో 3 కిలో మీటర్లు, 5 కిలో మీటర్ల దూరం ఉండే మినీ మారథాన్ పోటీలను నిర్వహించనున్నారు. జూలై 12 తేదిన విడుదలకు సిద్దమవుతున్న 'భాగ్ మిల్కా భాగ్' చిత్రానికి దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా.

'మరథాన్ పోటీలలో ఫరాన్ పరుగెత్తడాన్ని చూడాలని ఆసక్తి పెరుగుతోంది. సెల్యూలాడ్ పై మిల్కా సింగ్ గా అవతరించిన ఫరాన్ మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారు. అథ్లెట్ గా మారడానికి ఫర్హాన్ కఠోర శ్రమ అభినందించదగినది' అని ఈ చిత్రాన్ని నిర్మించిన వయాకామ్ 18 మోషన్ పిక్చర్ ప్రతినిధి తెలిపారు. ఫర్హాన్ నిర్వహించే మారథాన్ లో కార్యక్రమంలో పలు పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొంటారన్నారు.

>