యువ హీరోను గడగడలాడించిన మాజీ సీఎం

3 Feb, 2016 15:27 IST|Sakshi
యువ హీరోను గడగడలాడించిన మాజీ సీఎం

ఫొటో చూస్తూనే అర్థమై ఉంటుంది.. తన అద్భుతమైన స్టెప్పులతో 30 ఏళ్ల యువహీరో రణ్ వీర్ సింగ్ ను గడగడలాడించింది 78 ఏళ్ల మాజీ సీఎం ఫారూఖ్ అబ్దుల్లా అని! ఎన్డీటీవీ నిర్వహించిన 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కాసేపు షేక్ చేసిన ఈ పొలిటికల్- సినీ హీరోల డ్యాన్స్.. సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది.

రణ్ వీర్ సింగ్ కు 'బెస్ట్ ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రదానం చేసేందుకు స్టేజ్ పైకి వచ్చిన జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫారూఖ్.. 'బాజీరావు మస్తానీ' సినిమా పాటకు యువ హీరోతో కలిసి స్టెప్పులేశారు. రణ్ వీర్ కంటే అబ్దుల్లాయే అద్భుతంగా డాన్స్ చేయడంతో సభ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది. చూడబోతే ఆ కార్యక్రమం నాన్ స్టాప్ డ్యాన్స్ షోగా మారిపోతుందనుకున్నారో ఏమోగానీ చానెల్ ప్రతినిధి బర్ఖా దత్.. ఆ ఇద్దరినీ వారించారు.  

'సార్.. మీరుగానీ సినిమాల్లోకి వచ్చేదుంటే మా ముందు తరమంతా మటాష్ అయ్యిండేది' అన్న రణ్ వీర్ పొగడ్తకు బదులిస్తూ 'నాక్కూడా సినిమాలన్నా, నటనన్నా చచ్చేంత ఇష్టం. ఇప్పటికిలా కాలం గడిచిపోయింది. అయితే వచ్చే జన్మలో మాత్రం తప్పక నటుణ్నవుతా' అని చమత్కరించారు ఫారూఖ్ అబ్దుల్లా.