టెండూల్కర్ కాదు!

21 Feb, 2014 00:03 IST|Sakshi
టెండూల్కర్ కాదు!

 ఒకప్పటి ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ నటుడిగా మారారు. క్రికెట్ నేపథ్యంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ‘సచిన్’ అనే చిత్రంలో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటి సుహాసిని ఓ కీలక పాత్రలో ఏఎన్‌ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై బీయన్ గంగాధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘టెండూల్కర్ కాదు’ అనేది ఉపశీర్షిక. ఎస్. మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల పలువురు చిత్రరంగ ప్రముఖుల సమక్షంలో బెంగళూరులో వైభవంగా జరిగింది.
 
  ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మానవ సంబంధాల్ని హృద్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిత్రానికి రాజేష్ రాంనాథ్ పాటలు స్వరపరుస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు సచిన్ టెండూల్కర్ అతిథిగా హాజరవుతారు. 30 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేస్తాం’’ అని చెప్పారు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి