ఎన్టీఆర్ యాక్టింగ్ లో మార్పుకు కారణం ఏమిటి?

10 Feb, 2015 15:12 IST|Sakshi
ఎన్టీఆర్ యాక్టింగ్ లో మార్పుకు కారణం ఏమిటి?

చెన్నై: గతంతో పోలిస్తే తెలుగు నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటనలో చాలానే మార్పు వచ్చిందట. నటనలో మార్పుతో పాటు అతని వ్యక్తిత్వంలో కూడా మార్పులో చేసుకోవడం తనకు సృష్టంగా కనిపించిందని నటి కాజల్ అగర్వాల్ అన్నారు. ఈ జోడీలో వస్తున్న 'టెంపర్'  చిత్రం ఈ శుక్రవారం విడుదల అవుతున్న నేపథ్యంలో  కాజల్ మీడియాతో ముచ్చటించింది. 'ఎన్టీఆర్ గొప్ప నటుడు అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ తో పెళ్లికి ముందు.. తరువాత కలిసి నటించా.  అయితే ఇప్పుడు ఎన్టీఆర్ లో చాలానే మార్పు వచ్చింది. పెళ్లి అయిన తరువాత ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా వ్యక్తిత్వంలో కూడా హుందాతనం కనబడుతోంది.' అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

 

దీనంతటికీ కారణం ఎన్టీఆర్ ఓ బిడ్డకు జన్మినవ్వడమేనేమో అన్నది.  ఎన్టీఆర్ సెట్స్ లో ఎప్పుడూ  కొడుకు అభయ్ రామ్ గురించే మాట్లాడుతుంటూ..  చాలా సంతోషంగా ఉంటాడని కాజల్ తెలిపింది.  తండ్రి అవ్వడం అనేది మనిషిలో ఎంతటి మార్పును తీసుకొస్తుందో ఎన్టీఆర్ చూసి తెలుసుకున్నానని కాజల్ స్పష్టం చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా