ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్

9 Feb, 2016 23:26 IST|Sakshi
ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్

 ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్, సిమ్మీదాస్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. ఆర్‌పి ప్రొడక్షన్స్ పతాకంపై చందా గోవింద రెడ్డిని దర్శకత్వంలో భవనాసి రామ్‌ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కథ-కథనాలు, సంభాషణలు, పాటలు, హీరో, హీరోయిన్స్ నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఇటీవల వచ్చిన ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్స్‌లో టాప్ టెన్‌లో ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ‘ప్రాణం’ కమలాకర్ నేపథ్య సంగీతం, ఉద్ధవ్ ఎడిటింగ్ సినిమాకు ప్రాణం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: కొమారి సుధాకర్‌రెడ్డి, శ్రీపతి శ్రీరాములు.
 
 ప్రేమకథల్లో ప్రత్యేకం!
 సూర్యతేజ, హర్షికా పూంచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్ సమర్పణలో కె.ఆర్ విష్ణు దర్శకత్వంలో ప్రదీప్ కుమార్ జంపా నిర్మించిన చిత్రం ‘అప్పుడలా... ఇప్పుడిలా’. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘పాటలకి, ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. బ్రహ్మారెడ్డిగారు మంచి కథ ఇచ్చారు. సునీల్ కశ్యప్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘మంచి ప్రేమకథను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాం. ప్రేమకథా చిత్రాల్లో ప్రత్యేకంగా నిలుస్తుందని మా నమ్మకం. ట్రైలర్ విడుదల తర్వాత ట్రేడ్ వర్గాల్లో బజ్ క్రియేట్ అయ్యింది’’ అని దర్శకుడు చెప్పారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా