అంకితభావం అదుర్స్‌

27 Mar, 2017 02:23 IST|Sakshi

‘‘అబ్బబ్బబ్బా.. మేడమ్‌ చాలా సిన్సియర్‌. ఏమి డెడికేషన్‌... ఆ అంకితభావం అదుర్స్‌’’ అంటూ దీపికా పదుకొనేని ‘పద్మావతి’ యూనిట్‌ http://img.sakshi.net/images/cms/2017-03/51490561111_Unknown.jpgతెగ పొగిడేస్తోంది. అంతలా దీపికా పదుకొనే ఏం చేశారంటే... సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనె టైటిల్‌ రోల్‌ చేస్తోన్న చిత్రం ‘పద్మావతి’. రాణి పద్మిని జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ పాత్ర కోసం దీపిక బాగానే కసరత్తులు చేస్తున్నారట. రాణి పద్మిని పాత్రలో ఒదిగిపోవడానికి చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదువుతున్నారట. ఎక్కడికెళ్లినా దీపిక బ్యాగులో హిస్టరీ బుక్స్‌ ఉండాల్సిందేనట. షూటింగ్‌ షాట్‌ గ్యాప్‌లో, ప్రయాణాల్లో ఆ పుస్తకాలతో బిజీగా ఉంటున్నారని చిత్రబృందం అంటోంది.

ఈ సినిమా తప్ప మరో ధ్యాస లేదన్నట్లుగా దీపికా వ్యవహరిస్తున్నారని, ఆమె అంకితభావం చూస్తే ముచ్చటేస్తోందని కూడా ‘పద్మావతి’ బృందం ఈ బ్యూటీని కొనియాడుతోంది. ఈ సినిమాకి దీపిక ఎంతగా డెడికేట్‌ అయ్యారనేదానికి మరో నిదర్శనం కూడా ఉంది. ఈ షూటింగ్‌కి సెలవు పెట్టడం ఇష్టంలేక ప్రతిష్టాత్మక ‘కాన్స్‌ చలన చిత్రోత్సవాల’ను సైతం వదులుకున్నారట. నాలుగైదేళ్లుగా దీపిక ఓ సౌందర్య సాధనాన్ని ప్రమోట్‌ చేయడం కోసం అక్కడికెళుతున్నారు. ‘పద్మావతి’ షూటింగ్‌ కారణంగా ఈసారి వెళ్లడంలేదని దీపిక తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అప్పటివరకూ వేరే సినిమాలు అంగీకరించకూడదని దీపిక నిర్ణయించుకున్నారట. దాన్నిబట్టే ఈ సినిమాని ఎంతగా ప్రేమించి చేస్తున్నారో ఊహించుకోవచ్చు.